జిల్లాలో 175 మద్యం దుకాణాలు
పత్తాలేని రూ.99 బాటిళ్లు
పేదల కోసం అంటూ చంద్రబాబు ప్రకటించిన రూ.99 క్వార్టర్ బాటిళ్లు మద్యం దుకాణాల్లో కనిపించడం లేదు. వీటిపై వచ్చే మార్జిన్ తక్కువగా ఉండటంతో వ్యాపారులు అమ్మకాలకు ఆసక్తి చూపడం లేదు. రూ.99 బాటిళ్లు లేవని చెబుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో మందుబాబులు జేబులు గుల్ల చేసుకుంటున్నారు. భీమవరంలో ఎక్స్‌ట్రా ధరలపై ఎకై ్సజ్ సీఐ బలరామరాజును ఫోన్‌లో సంప్రదించగా విషయం తమ దృష్టికి రాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో..
గత టీడీపీ హయాంలో విచ్చలవిడిగా సాగిన మద్యం అమ్మకాలకు గత వైఎస్సార్ ప్రభుత్వం కళ్లెం వేసింది. ప్రభుత్వ మద్యం పాలసీని తెచ్చి బెల్టుషాపులను అరికట్టడంతో పాటు నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు చేసేలా చర్యలు తీసుకుంది. షాపుల వద్ద మద్యం కొనుగోలు చేసి తీసుకువెళ్లడమే తప్ప అక్కడే తాగేందుకు వీలు లేకుండా చేసింది. ఎమ్మార్పీకి మించి అధిక ధరల ఊసే లేదు. అప్పట్లో ఊరి చివర ఎక్కడో ఉన్న మద్యం దుకాణాలు ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చేశాయి. నాడు మద్యంపై వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరితే ప్రస్తుతం కూటమి నేతలు, సిండికేటు వర్గాల జేబుల్లోకి వెళుతుండటం గమనార్హం.
సాక్షి, భీమవరం: పేద, మధ్యతరగతి మందుబాబులే లక్ష్యంగా మద్యం సిండికేట్లు ధరలను పెంచేశాయి. మద్యం వ్యాపారుల కోసం గత నెలలో చంద్రబాబు సర్కారు బాటిల్‌పై రూ.10ల చొప్పున పెంచితే.. తాజాగా సిండికేట్లు మరో రూ.10 పెంచి విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో తెరవెనుక సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, ఎకై ్సజ్ అధికారులకు భారీగానే ముడుపులు అందుతున్నట్టు సమాచారం.
ఎమ్మార్పీపై రూ.20 ఎక్స్‌ట్రా
లిక్కర్ సిండికేట్లకు మేలు చేసేలా అమ్మకాలపై 10 శాతంగా ఉన్న మార్జిన్‌ను గత నెలలో ప్రభుత్వం 14 శాతానికి పెంచింది. ఆ భారాన్ని మందుబాబులపై మోపుతూ మద్యం ధరలను 15 శాతం వరకు పెంచింది. దీంతో పేద, మధ్యతరగతి వర్గాల వారు అధికంగా సేవించే రూ.120, రూ.130, రూ.150, రూ.180, రూ.190 క్వార్టర్ బాటిళ్ల ధరలు రూ.10 వంతున పెరిగాయి. ఇది చాలదన్నట్టు జిల్లా కేంద్రమైన భీమవరం, ఇతర నియోజకవర్గాల్లో రూ.130 నుంచి రూ.210 వరకు ఉన్న బ్రాండ్లపై రూ.10లు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం బాటిళ్లపై పాత ఎమ్మార్పీ ధరలే ఉండటంతో రూ.20 ఎక్స్‌ట్రా (గత నెలలో ప్రభుత్వం పెంచిన రూ.10, ఇప్పుడు సిండికేట్ పెంచిన రూ.10 కలిపి) వసూలు చేస్తున్నారు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత బ్రాండ్‌ను బట్టి ఈ ధరలను మరింత పెంచేస్తున్నారు. కూలింగ్ చార్జీల పేరిట బీర్లుపై రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అధికంగా వినియోగం ఉండే రూ.130 నుంచి రూ.210 మధ్య ఉన్న బ్రాండ్ల ధరలను ప్రధానంగా పెంచుతున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో రోజుకు సుమారు రూ.3.50 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుండగా రూ.20 ఎక్స్‌ట్రా రూపంలో మందుబాబులపై రూ.కోటికి పైగా అదనపు భారం పడుతోందని అంచనా.
ధరలు పెంచి.. పేదలను ముంచి..
గత నెలలో బాటిల్‌కు రూ.10 వడ్డన
తాజాగా సిండికేట్లు మరో రూ.10 పెంపు
ఎమ్మార్పీకి మించి అమ్మకాలు
జిల్లాలో మందుబాబులపై రోజుకు రూ.కోటికి పైగా భారం
కూటమి నేతలు, ఎకై ్సజ్ వర్గాలకు భారీగా ముడుపులు
జిల్లాలో మద్యం ఆదాయం రోజుకు రూ.3.50 కోట్లు
జిల్లాలో 175 మద్యం దుకాణాలు ఉండగా కూటమి సిండికేట్లు పర్యవేక్షణలోనే షాపుల నిర్వహణ సాగుతోంది. ఎకై ్సజ్ పాలసీకి విరుద్ధంగా చాలా చోట్ల మద్యం దుకాణాలను బార్ అండ్ రెస్టారెంట్ల మాదిరి మార్చేశారు. షాపుల వద్దనే మద్యం సేవించేందుకు టేబుళ్లు, కుర్చీలతో సిట్టింగ్ ఏర్పాట్లు, మంచింగ్ కోసం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, సోడా, డ్రింక్, వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. లూజ్ సేల్స్, బెల్టుషాపులు షరా మామూలే. నెలరోజుల క్రితం జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి భీమవరంలోని మద్యం షాపుల్లో స్వయంగా తనిఖీలు చేసి నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయించినా పరిస్థితిలో మార్పు రాలేదన్న విమర్శలున్నాయి.
మద్యంతర బాదుడు