
రికవరీ చేసిన సెల్‌ఫోన్ల పంపిణీ
భీమవరం: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దొంగిలించబడిన, చేజార్చుకున్న రూ.23 లక్షల విలువైన 155 సెల్‌ఫోన్లను బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధితులకు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో చోరీకి గురైన, పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను రికవరీ చేసి తొమ్మిది విడతల్లో సుమారు రూ.రెండు కోట్లు విలువైన 1,394 సెల్‌ఫోన్లు రికవరీచేసి బాధితులకు అందజేశామన్నారు. 9వ విడతలో 155 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అహ్మదున్నిషా, ఎస్సై నాగేశ్వరరావు ఇతర సిబ్బంది విశేషంగా కృషిచేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి భీమారావు, ఆర్మ్ ్డ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, భీమవరం డీఎస్పీ రావూరి గణేష్ జయసూర్య తదితరులు పాల్గొన్నారు.