పాలకొల్లు సెంట్రల్: ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న బిల్లును వ్యతిరేకిస్తున్నామని వెంటనే బిల్లును ఆపాలని మాల మాహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ అన్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా అధ్యక్షుడు గుండె నగేష్ బాబు అధ్యక్షతన జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ముందుగా కులగనణ జరిపి తరువాత జనాభా ప్రాతిపదికన దామాషా పద్ధాతిలో అన్ని కులాలను వర్గీకరణ చేయాలన్నారు. కేవలం మాల మాదిగల మధ్య చిచ్చుపెట్టి ఈ రెండు కులాలు కొట్టుకునేలా వర్గీకరణను తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. ఎప్పటికై నా మంద కృష్ణ మాదిగ వర్గీకరణ అనే అంశాన్ని పక్కనపెట్టి రాజ్యాధికారం కోసం పోరాడితే మాలలు అందరూ కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నారని గ్రహించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి విప్పర్తి ప్రభాకర్, నల్లి సంజీవరావు, నల్లి జయరాజు, పాలపర్తి కృపానాథ్, గాది రవి, బద్ద అంతర్వేది, మట్టా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.