మధ్యవర్తిత్వంతో కేసుల సత్వర పరిష్కారం
వేలేరుపాడు: వేలేరుపాడు మండలంలో రూ.500 నకిలీ నోట్లు చెలామణి అవుతున్నట్లు తెలిసింది. సోమవారం వేలేరుపాడు వైన్‌షాపు వద్దకు ఓ వృద్ధురాలు మద్యం కొనుగోలుకు 2,500 తీసుకెళ్లగా, వైన్ షాపు సిబ్బంది అవి నకిలీ నోట్లుగా గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, సారపాక కేంద్రాలుగా ఈ దొంగనోట్ల వ్యాపారాన్ని వేలేరుపాడు మండలంలో కొంతమంది వ్యక్తులు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. శివకాశీపురానికి చెందిన ఓ వ్యక్తి బతుకుదెరువు కోసం భద్రాచలం ప్రాంతంలో ఓ పురుగుమందుల షాపులో గత కొన్నేళ్ళుగా గుమస్తాగా చేరాడు. దొంగనోట్ల ముఠాతో చేతులు కలిపిన సదరు గుమస్తా వేలేరుపాడు మండలం రేపాకగొమ్ముకు చెందిన తన బావమరిదికి దొంగనోట్లు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై నిఘా వర్గాలు విచారణ చేపడితే వాస్తవాలు వెలుగుచూస్తాయంటున్నారు.