
కేంద్ర మంత్రికి మోషేనురాజు పరామర్శ
భీమవరం : ఢిల్లీలో రోడ్డుప్రమాదంలో కాలికి గాయమైన కేంద్ర ఉక్కు, భారీపరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు పరామర్శించారు. భీమవరంలో శనివారం శ్రీనివాసవర్మ నివాసానికి వెళ్లిన మోషేనురాజు ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. విశ్రాంతి తీసుకుని త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలి
మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
బుట్టాయగూడెం: గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఆదివాసీలపై ఉందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త తెల్లం రాజ్యలక్ష్మి అన్నారు. కామవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న గుబ్బల మంగమ్మతల్లి జాతర మహోత్సవాల్లో వారు పాల్గొని పూజారి వర్సా పుల్లారావు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత బాలరాజు దంపతులకు ఆలయ కమిటీవారు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం బాలరాజు, రాజ్యలక్ష్మి దంపతులు కొద్దిసేపు గిరిజన సంప్రదాయ డోలు కొయ్యి నృత్యాలు చేసి సందడి చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు కోర్సా గంగరాజు, కోర్సా రాంబాబు, గుజ్జు రామారావు, తదితరులు బాలరాజు దంపతులను శాలువా కప్పి సత్కరించారు.
రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఉంగుటూరు: చేబ్రోలు రైల్వేస్టేషన్‌లోని వెయింటింగ్ హాల్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడి వయస్సు 55 సంవత్సరాలు ఉంటుందని, తెలుగురంగు చిన్ని గీతల పుల్ హ్యండ్ షర్టు, బిస్కట్ రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నట్లు రైల్వే ఎస్సై పి.అప్పారావు తెలిపారు. మృతదేహన్ని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలిస్తే 94906 17090, 99480 10061 నంబర్లలో తెలియజేయాలన్నారు.

కేంద్ర మంత్రికి మోషేనురాజు పరామర్శ

కేంద్ర మంత్రికి మోషేనురాజు పరామర్శ