
కేసుల పరిష్కారానికి కృషి
ఏలూరు (టూటౌన్): ప్యానల్ న్యాయవాదులు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని డీఎల్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి కె.రత్నప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం ఏలూరు, భీమడోలు కోర్టుల పరిధిలో ప్యానల్ న్యాయవాదులతో ఆయన సమావేశం ఏర్పాటుచేశారు. న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత సేవలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని, న్యాయవిజ్ఞాన సదస్సు ల్లో పాల్గొని ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగించాలని, సంక్షేమ పథకాలను పొందటానికి అర్హులైన వారికి అవసరమైతే న్యాయ సహాయాన్ని అందించాలని సూచించారు. ఆయా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.