బుర్రకథ గానకోకిల మిరియాల | - | Sakshi
Sakshi News home page

బుర్రకథ గానకోకిల మిరియాల

Jan 26 2025 6:03 AM | Updated on Jan 26 2025 6:03 AM

బుర్రకథ గానకోకిల మిరియాల

బుర్రకథ గానకోకిల మిరియాల

ప్రజల్లో పరివర్తన రావాలి
హెల్మెట్‌ ధారణ విషయంలో వాహనచోదకుల్లో పరివర్తన తీసుకురావాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ అశోక్‌కుమార్‌ అన్నారు. IIలో u

5 వేల ప్రదర్శనలతో రికార్డు

అప్పారావును వరించిన పద్మశ్రీ

గూడెం ఖ్యాతిపెంచిన కళాకారుడు

తాడేపల్లిగూడెం: చేతిలో తంబుర శృతి ఇస్తుంటే.. కాళ్లకు ఉన్న గజ్జెలు తాళం వేస్తుంటే.. ఒళ్లంతా అభినయిస్తూ.. కాళ్లను కదుపుతూ బుర్రకు పదునుపెడుతూ.. బుర్రకథ చెప్పే నిష్ణాతుడు ఆయన. బుర్రకథ పేరు చెబితే నాజర్‌, ఠాణేలంక నిట్టల బ్రదర్స్‌ పేర్లు వినిపించేవి. తూర్పుగోదావరి జిల్లా నడుకుదురులో జన్మించిన మిరియాల అప్పారావు ఓనమాల రోజుల్లో గానాలాపన చేస్తూ, రాగాలప్పారావుగా ఖ్యాతిగడించారు. నాజర్‌ వంటి గురువుల వద్ద బుర్రకథలో మెలకువలను నేర్చుకుని అరంగేట్రంలోనే శభాష్‌ అనిపించుకున్నారు. అప్పారావు అమ్మమ్మ ఊ రు నడకుదురు కాగా తండ్రిది రావులపాలెం. ఆ యన కుమార్తె ఊరు తాడేపల్లిగూడెంలోనూ బు ర్రకథ కళకు జవజీవాలిస్తూ తెలుగు రాష్ట్రాల్లో బుర్రకథ కళాకారులు సుమారు 70 శాతం మందికి గురువుగా ఎదిగారు. ఏడాదిలో సుమారు 300 ప్రదర్శనలు ఇచ్చిన చరిత్ర ఆయనది. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలతో పాటు సింగపూర్‌లోనూ ఆయన 5 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. గానకోకిల, బుర్రకథ టైగర్‌ వంటి బిరుదులను సొంతం చేసుకున్నారు. బుర్రకు పదునుపెట్టే కళను బుర్రకథగా రక్తికట్టించిన ఆయన ఇటీవల తాడేపల్లిగూడెంలో పరమపదించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. వారసత్వంగా బుర్రకథను కుమార్తె యడవల్లి శ్రీదేవికి వరంగా ఇచ్చారు. గతంలో అప్పారావు వైఎస్‌ఆర్‌ అచీవ్‌మెంటు అవార్డును మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా అందుకున్నారు. మరణానంతరం పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుని మరోమారు జాతీయస్థాయిలో పేరుగడించారు మిరియాల అప్పారావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement