
బాబు మోసాన్ని ఇంటింటికీ వివరించాలి
ఇరగవరం: ప్రజలకు మోసపూరిత హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు ఏ ఒక్క హమీ కూడా నేరవేర్చకుండా ప్రజలను దగా చేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఇరగవరం మండలంలోని కొత్తపాడు గ్రామంలో ‘ాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళలను, యువతను, ఉద్యోగులను మోసం చేశారన్నారు. చంద్రబాబు మోసపూరిత హమీలపై క్యూఆర్ కోడ్‌తో కూడిన బ్రోచర్‌ను ఇంటింటికీ అందించాలన్నారు. ప్రజలను మోసం చేయడలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు, మాజీ డీసీఎంస్ డైరెక్టర్ పెన్మెత్స సుబ్బరాజు, పెన్మెత్స రాంభద్ర రాజు, పార్టీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గారావు, సత్తి వెంకట రెడ్డి, గుడిమెట్ల వీర్రెడ్డి, మేట్ల కిరణ్మయి, వీరమల్లు ఫణీంద్ర, కోవ్వూరి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ బొక్కా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.