
కనకాయలంక కాజ్‌వే పరిశీలన
యలమంచిలి: గోదావరిలో వరద పెరుగుతున్న నేపథ్యంలో కనకాయలంక కాజ్ వే మునిగితే తీసుకోవలసిన రక్షణ చర్యలను పరిశీలించేందుకు మంగళవారం ఆర్డీఓ దాసి రాజు కనకాయలంక వచ్చారు. గ్రామంలో అడ్వాన్స్‌గా నెల రేషన్ సరుకులు నిల్వ ఉంచాలని, కాజ్‌వేను వరద నీరు ముంచితే ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఇంజన్ పడవలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామంలోని తుపాన్ షెల్టర్‌ను పరిశీలించారు. అనంతరం పెదలంక వెళ్లి వరద వస్తే తీసుకోవాల్సిన రక్షణ చర్యలను వివరించారు. ఆయన వెంట తహసీల్దార్ గ్రంథి నాగ వెంకట పవన్‌కుమార్ వీఆర్వోలు కడిమి ఘనలక్ష్మీ, కాకితాపల్లి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.