ఆకివీడు: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం ఆధీనంలో నడుస్తున్న వేద పాఠశాలల్లో ప్రవేశానికి బాలుర నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నట్లు వేద పాఠశాల ప్రతినిధి తెలిపారు. ఈమేరకు వెబ్‌సైట్‌లో వీక్షించి జూన్ 20వ తేదీలోపు దరఖాస్తుల్ని పంపాలని చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వేద పాఠశాలల్లో అయిభీమవరం గ్రామంలోని వేద పాఠశాలతో పాటు ధర్మగిరి, విజయనగరం, నల్గొండ, కీసర గుట్ట, కోటప్ప కొండ ప్రాంతాల్లోని పాఠశాలల్లో వేదం నేర్చుకునేందుకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నారు. వైదిక సాంప్రదాయం ప్రకారం ఉపనయనం కాబడి, నిర్ణీత వయస్సు, విద్యా ప్రమాణాలు కల్గిన బాలల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.