
మార్టేరు వరి పరిశోధనా స్థానం ముఖద్వారం
నేడు కిసాన్ మేళా
పెనుమంట్ర: మార్టేరు వరి పరిశోధనా స్థానంలో బుధవారం కిసాన్ మేళా నిర్వహించనున్నట్టు సంస్థ సహ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పరిశోధనా స్థానం అభివృద్ధి చేసిన నూతన వరి వంగడం, ఆధునిక యంత్రాలు, పనిముట్లు, ఇతర సాంకేతిక క్షేత్ర సందర్శన, రైతులు, శాస్త్రవేత్తల ముఖాముఖి తదితర కార్యక్రమాలను ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు అధ్యక్షతన నిర్వహిస్తామన్నారు. వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు.