
ఈలి మణికంఠ నాయుడు (32)
భీమవరం అర్బన్: భీమవరం రూరల్ పో లీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఓ విక లాంగుడు నీటిగుంటలో పడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కొమరాడ రోడ్డులోని యూనోఫీడ్స్ వద్ద బీహార్‌కు చెందిన యవజేష్ రాయ్ (32) తన స్నేహితుడు జి.తేంద్రకుమార్ వద్దకు వస్తూ.. ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మృతి చెందినట్టు ఆయన కుటుంబసభ్యులు తె లిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మోహన్‌రావు చెప్పారు.
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
పాలకొల్లు అర్బన్: దిగమ ర్రు – చించినాడ జాతీయ రహదారిలో దిగమర్రు వద్ద సోమవారం తెల్లవారుజాము న జరిగిన రోడ్డు ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పెనుమాల గ్రామానికి చెందిన ఈలి మణికంఠనాయుడు (32) మృతి చెందారు. మణికంఠనాయుడు తన భార్య రామదుర్గతో కలిసి పాలకొల్లులో బంధువుల ఇంటికి వివాహా నికి హాజరై తిరిగి వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. చించినాడ వైపు మోటార్ సైకిల్‌పై వెళ్తున్న వీరిని ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయాలైన రామదుర్గ పాలకొల్లులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. హోల్‌సేల్ చికెన్ వ్యాపారి మణికంఠనాయుడుకు వివాహమై 46 రోజులు గడచినట్టు బంధువులు తెలిపారు. మణికంఠనాయుడు చిన్నాన్న కాశీ విశ్వనాథం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని రూరల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సీహెచ్‌వీఎం మూర్తి తెలిపారు.