ఎఫ్‌ఆర్‌ఎస్‌తో ఉన్నత విద్య బలోపేతం | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఆర్‌ఎస్‌తో ఉన్నత విద్య బలోపేతం

Mar 30 2026 7:18 AM | Updated on Mar 30 2026 7:18 AM

కేయూ క్యాంపస్‌ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్‌) అమలుతో ఉన్నత విద్య బలోపేతం అవుతోందని తెలంగాణ గవర్నమెంట్‌ కాలేజీ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీజీసీటీఏ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్‌గౌడ్‌, బ్రిజేశ్‌ పేర్కొన్నారు. ఆదివారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రాథమిక సభ్యుల సంక్షేమం, డిగ్రీ కళాశాలల ఉన్నతి, మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల అభ్యున్నతికి తెలంగాణ కాలేజీ టీచర్స్‌ అసోసియేషన్‌ నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. ఈ సమావేశంలో చందా కాంతయ్య మెమోరియల్‌ కళాశాల (సీకేఎం) నుంచి ఇటీవల క్రమబద్ధీకరణ పొందిన అధ్యాపకులు మూకుమ్మడిగా సంఘంలో సభ్యత్వం పొందారు. వీరిని రాష్ట్ర కార్యవర్గం సంఘంలోకి ఆహ్వానించారు. అనంతరం వివిధ కళాశాలల అధ్యాపకులకు సంబంధించిన వేతన బకాయిలు, పదోన్నతికి సంబంధించిన అంశాలు, నూతన వేతన సవరణలో ఆమోదయోగ్యమైన ఫిట్‌మెంట్‌ వంటి అనేక అంశాల పరిష్కారానికి సంబంధించిన తీర్మానాలను ఆమోదించించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎం.భవాని, అసోసియేట్‌ సెక్రటరీ అమరేందర్‌ రెడ్డి, ఆఫీస్‌ సెక్రటరీ సుభాశ్‌రెడ్డి, మల్టీ జోన్‌–1 ఉపాధ్యక్షుడు ఎ.రమేష్‌, కాకతీయ విశ్వవిద్యాలయం సెక్రటరీ డి.సమ్మయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.సీతారాములు, జి.మహేందర్‌, శాతవాహన విశ్వవిద్యాలయం సెక్రటరీ రాజేశ్‌, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.

టీజీసీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్‌గౌడ్‌, బ్రిజేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement