న్యూస్‌రీల్
వరంగల్
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026
ఆన్‘లైన్’లోకి
ఈసారి కూడా లోటేనా?
కాకతీయ యూనివర్సిటీ 41వ అకడమిక్ సెనెట్ సమావేశం నేడు (సోమవారం) పరిపాలన భవనంలో నిర్వహించనున్నారు.
ఐపీఎల్ టోర్నీ ప్రారంభమవడంతో మళ్లీ తెరమీదకు..
సాక్షి, వరంగల్: ‘మొదట చిన్నగా గెలిపిస్తారు.. తర్వాత ఎక్కువ డబ్బు పెట్టేలా చేస్తారు.. లాస్ అయితే ఇంకోసారి మనీ పెడితే వస్తుంది అనిపిస్తుంది’.. ఇదే అసలైన ట్రాప్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్వంటీ20 టోర్నీ మొదలైన వేళ ఈ సైకాలజీ ట్రాప్ (ఆన్‌లైన్ బెట్టింగ్) ఎక్కువ జరిగే అవకాశముందని పాత ఘటనలే గుర్తుచేస్తున్నాయి. అయితే శనివారం వైభవంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజ్ బెంగళూరు మ్యాచ్‌తో మొదలవడంతో ఈ టోర్నీ జోష్‌ను క్యాష్ చేసుకునేందుకు బెట్టింగ్ రాయుళ్లు సిద్ధమయ్యారు. కరోనా తర్వాత సెల్‌ఫోన్ల వాడకం పెరగడంతో ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ పట్టణాల నుంచి పల్లెలకు కూడా విస్తరించింది. ఎవరితో సంబంధం లేకుండానే సెల్‌ఫోన్‌లోనే క్రికెట్ బెట్టింగ్ యాప్‌లు నిక్షిప్తం చేసుకొని ఫోన్ పే, గూగుల్ పే యూపీఐలతో డబ్బులు బదిలీ చేస్తూ గుట్టుచప్పుడూ కాకుండా బెట్టింగ్ చేస్తున్నారు. కొందరేమో తమ తల్లిదండ్రులు బ్యాంక్ ఖాతాలు అనుసంధానం చేసిఉన్న యూపీఐ ఐడీల ద్వారా పందెం కాస్తున్నారు. అలాగే కూర్చున్న చోటి నుంచి డబ్బులు సంపాదించొచ్చన్న అత్యాశతో యువత నుంచి ఉద్యోగులు సైతం గతంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లో ఆడి మోసపోయిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడూ మళ్లీ ఐపీఎల్ మెగా క్రికెట్ టోర్నీ ప్రారంభమవడంతో ఈ బెట్టింగ్ యాప్‌ల జోరు పెరుగొచ్చని వరంగల్ కమిషనరేట్ పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే పిల్లలు వాడే సెల్ ఫోన్లతో పాటు వారి ప్రవర్తనపై కన్నేసి ఉంచాలంటున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ చేసిన వాళ్లపైనే కేసుల నమోదుకు ఆస్కారం ఉండడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఈ ఆన్‌లైన్ పందెం జోరుగా సాగుతోందని పోలీసులు అంటున్నారు. వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
కొత్త రూపు సంతరించుకున్న దందా
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు ఒప్పుడు ఫోన్‌ల ద్వారా ఆయా జట్టు విజయాలపై బుకీలకు సమాచారం ఇచ్చేవారు. ఫంటర్లను పెట్టుకొని దందా చేసేవారు. ఇప్పటికీ ఈ దందా ఉన్నా... ఇప్పుడు కొత్త రూపు మార్చుకుంటోంది. నిర్వాహకుడే సొంతంగా యాప్ రెడీ చేసి వివిధ నగరాల్లో ఉంటున్న బుకీలకు యూజర్ నేమ్, పాస్ వర్డ్‌లు ఇచ్చి సరికొత్త దందాకు శ్రీకారం చుట్టారు. ప్రధాన నిర్వాహకులు ఆయా జట్ల విజయాలకు సంబంధించిన రేషియోను ఆ యాప్‌లో నిక్షిప్తం చేస్తుండడంతో ఇందుకు అనుగుణంగా బుకీలు తమ ఫంటర్లకు చెప్పి దందాలు సాగిస్తున్నారు. ఇలా బుకీలకు వచ్చిన ఆదాయంలోనే కొంత డబ్బును ప్రధాన నిర్వాహకుడికి అందిస్తారు. ఫోన్ పే, గూగుల్ పే చెల్లింపులతో పోలీసులకు దొరికే అవకాశం ఉండడంతో బిట్ కాయిన్‌ల రూంలో బెట్టింగ్ దందా చేస్తుండడం గమనార్హం. ఇప్పటికే పోలీసులకు చిక్కిన బెట్టింగ్ బుకీలతో ఈ దందా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
సమాచారం ఇవ్వండి..
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల గురించి సమాచారం తెలిస్తే ఇవ్వాలి. యువత బెట్టింగ్ చేయొద్దు. బెట్టింగ్‌లతో యువత అప్పులు, ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యల వరకు వెళ్లడంతో కుటుంబ జీవన విధానంపై ప్రభావం చూపుతుంది.
– సన్ ప్రీత్‌సింగ్, పోలీస్ కమిషనర్
యాప్‌ల ద్వారానే పందెం,
ఆపై డబ్బు హుష్‌కాకి
తొలుత లాభం చూపిస్తారు..
ఆ తర్వాతే ఎత్తుకెళ్తారు
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు దూరంగా ఉంటేనే మంచిది
గతంలో బెట్టింగ్ చేసి ప్రాణాలు
తీసుకున్న యువత
దొరికితే ఎఫ్‌ఐఆర్‌లే..
ఈ యాప్‌లతో జాగ్రత్త..
ఇల్లీగల్ స్పోర్ట్స్ బెట్టింగ్ కార్యకలాపాల విలువ భారత్‌లో ప్రతీ ఏటా రూ.8,20,000 కోట్ల దాకా ఉంటుందని థింక్ ఛేంజ్ ఫోరం (టీసీఎఫ్) చెబుతున్న రిపోర్ట్ ఆన్‌లైన్ బెట్టింగ్ జోరును చెబుతోంది. ముఖ్యంగా బెట్టింగ్ యాక్టివిటీ జోరును ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పెంచుతోందని గతంలోనే వెల్లడించింది. దాదాపు 75 వెబ్‌సైట్లు, యాప్‌లు బెట్టింగ్‌కు సంబంధించినవి పనిచేస్తుండడంతో కోట్లాది మంది ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ బారిన పడుతున్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డప్ఫాబెట్, 1 ఎక్స్‌బెట్, స్కై ఎక్స్ ఛేంజ్, ఫ్యాన్సీ లైఫ్, క్రికెట్ మజా, లైవ్ లైన్ గురూ, లోటస్, బెట్ 65, బెట్ ఫెయిర్ వంటి ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్‌లు డౌన్‌లోడ్ చేసి పందెం కాస్తూ నష్టపోయిన వారు గతంలో చాలా మంది ఉన్నారు.
హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, ఇంటర్‌నెట్ సెంటర్లు, సిటీ శివారుల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకొని టీవీతో పాటు ఇతర సదుపాయాలు సమకూర్చుకొని బెట్టింగ్ దందా చేసే అవకాశముంది. 2023లో తొమ్మిది కేసుల్లో 23 మందిని అరెస్టు చేసి రూ.7,99,000లు, 2024లో ఐదు కేసుల్లో ముగ్గురిని అరెస్టు చేసి రూ.34,43,700లు, 2025లో ఆరు కేసుల్లో 16 మందిని అరెస్టు చేసి రూ.3,63,500ల నగదును వరంగల్ కమిషనరేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈసారి కూడా ఇలా జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు నిఘా పెంచారు. ఈ తరహా కేసుల్లో అరెస్ట్ అయితే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తుండడంతో యువత కెరీర్‌కు ఇబ్బందయ్యే అవకాశం ఉండనుంది. అందుకే ఈ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని పోలీసులు అంటున్నారు.


