వార్డు సభ్యులుగా దంపతుల గెలుపు
పర్వతగిరి: మండలంలోని కొంకపాక గ్రామపంచాయతీలో దంపతులు వార్డు సభ్యులుగా గెలుపొందారు. గ్రామానికి చెందిన బొక్కల బాబు ఒకటో వార్డు సభ్యుడిగా, రెండో వార్డు సభ్యురాలిగా ఆయన భార్య బొక్కల హిమబిందు గెలుపొందారు. బొక్కల బాబుకు 107 ఓట్లు, ప్రత్యర్థి మాదాసి దేవరాజుకు 49 ఓట్లు వచ్చాయి. చెల్లనివి ఆరు ఓట్లు, నోటాకు ఒక ఓటు పోలైంది. రెండో వార్డులో హిమబిందుకు 109 ఓట్లు రాగా, ఆమె ప్రత్యర్థి మాదాసి సరితకు 52 ఓట్లు వచ్చాయి. చెల్ల నివి నాలుగు, నోటాకు రెండు ఓట్లు పోలయ్యాయి. బొక్కల బాబు, హిమబిందు కూడా దంపతులు కావడం విశేషం.
వార్డు సభ్యులుగా దంపతుల గెలుపు


