మొదటి విడత విజేతలు వీరే..
వర్ధన్నపేట/పర్వతగిరి/రాయపర్తి: జిల్లాలో మొదటి విడత వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి అర్ధరాత్రి వరకు అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టి గెలిచిన సర్పంచ్‌లను ప్రకటించారు.
నీ కాళ్లు మొక్కుతా.. ఒక్క ఓటు
దుగ్గొండి: మండలంలోని రేకంపల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది. గ్రామ పారిశుద్ధ్య కార్మికురాలు కొలుగూరి సుజాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి నామినేషన్ వేసింది. అయితే, ప్రచారం చివరి రోజు శుక్రవారం గ్రామంలోని పలువురి ఇళ్లకు తన కుమారుడు సుమంత్‌తో కలిసి వెళ్లింది. ఒక్క ఓటు వేసి సర్పంచ్‌గా గెలిపించండి ప్లీజ్ అంటూ ఓటర్ల కాళ్లు మొక్కారు.
‘మంత్రిపై చర్యలు తీసుకోవాలి’
ములుగు రూరల్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరారు. రెండో విడత ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత సభలు, సమావేశాలు, మైక్‌లతో ప్రచారం నిర్వహించకూడదు. ఈ మేరకు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత జాకారంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలు అతిక్రమించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తలరాతలు మార్చిన ఒక్క ఓటు
కమలాపూర్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ‘ఒక్క ఓటు’ విలువ ఏంటో పోటీపడ్డ అభ్యర్థులతో పాటు గ్రామస్తులకు తెలియజేసింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లిలో గువ్వాడి లక్ష్మికి 368 ఓట్లు రాగా ఆమె ప్రత్యర్థి అర్వపెల్లి మంజులకు 367 ఓట్లు వచ్చాయి. శనిగరంలో కొత్తపల్లి రాజుకు 1,153 ఓట్లు రాగా ఆయన ప్యత్యర్థి మాదాసి సంపత్‌కు 1,152 ఓట్లు వచ్చాయి. ఈ రెండు గ్రామాల్లో గువ్వాడి లక్ష్మి, కొత్తపెల్లి రాజు ఒకే ఒక్క ఓటుతో గెలుపొంది సర్పంచులుగా అందలం ఎక్కగా, ఒక్క ఓటు తేడాతో ఓడిన ప్రత్యర్థుల ఆశలు గల్లంతయ్యాయి.
మొదటి విడత విజేతలు వీరే..
మొదటి విడత విజేతలు వీరే..
మొదటి విడత విజేతలు వీరే..
మొదటి విడత విజేతలు వీరే..
మొదటి విడత విజేతలు వీరే..
మొదటి విడత విజేతలు వీరే..
మొదటి విడత విజేతలు వీరే..
మొదటి విడత విజేతలు వీరే..
మొదటి విడత విజేతలు వీరే..
మొదటి విడత విజేతలు వీరే..
మొదటి విడత విజేతలు వీరే..
మొదటి విడత విజేతలు వీరే..


