ఎస్సారెస్పీ భూముల కబ్జా | - | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీ భూముల కబ్జా

Nov 8 2025 8:08 AM | Updated on Nov 8 2025 8:08 AM

ఎస్సా

ఎస్సారెస్పీ భూముల కబ్జా

ఎస్సారెస్పీ భూముల కబ్జా

ప్రధాన కార్యాలయ సమీపంలోనే అక్రమ నిర్మాణాలు ● మొద్దు నిద్రలో అధికారులు

హసన్‌పర్తి: ఎస్సారెస్పీ కాల్వకు ఇరువైపులా కొందరు అక్రమార్కులు భూములను కబ్జా చేస్తున్నారు. కోట్లాది రూపాయల భూములు చేజిక్కించుకుంటున్నారు. ఈప్రాంతంలో భూములకు గజం రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ధర పలుకుతోంది. ఒక్కొక్కరు సుమారు నాలుగు వందల గజాల నుంచి వేయి గజాల వరకు ఆక్రమించుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో రైతుల నుంచి ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములను సేకరించింది. అయితే ప్రస్తుతం అన్నాసాగరం నుంచి పైడిపల్లి వరకు పెద్ద ఎత్తున భూములు కబ్జాకు గురయ్యాయి. ఈభూములను బడా నేతలు, రియల్టర్లు ఆక్రమించుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రధాన కార్యాలయం సమీపంలోనే..

ఎస్సారెస్పీ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే కబ్జాలు జరుగుతున్నాయి. ప్రధాన కాల్వ పక్కనే మంత్రపురి కాలనీ, వెంకటేశ్వర కాలనీతో పాటు చౌదరికుంట, పలివేల్పుల, రెడ్డిపురం, గుండ్లసింగారం, యాదవనగర్‌ ఏరియాల్లో ఎస్సారెస్పీ భూములు కబ్జా చేసుకుని పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చుట్టూ అక్రమార్కులు కంచె ఏర్పాటు చేసుకున్నారు.

మొద్దు నిద్రలో అధికారులు

ఎస్సారెస్పీ భూములు కబ్జాకు గురవుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి నాలుగు నుంచి ఆరు నెలల కాలం పట్టినప్పటికీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమార్కుల నుంచి నయానో బయానో తీసుకుని చూసీచూడనట్లుగా వ్యవహరించారనే స్థానికంగా చర్చించుకుంటున్నారు.

హసన్‌పర్తి: నగరంలోని ఓ భూకబ్జా ముఠాకు చెందిన సుమారు 20మంది గొడ్డళ్లు, గడ్డపారలతో గురువారం అర్ధరాత్రి హల్‌చల్‌ చేశారు. నగరంలోని టీఎన్జీఓస్‌ కాలనీలోని సరస్వతి మందిరం గ్రంథాలయ భవనాన్ని కూల్చేశారు. హనుమకొండ టీఎన్జీఓస్‌ కాలనీ–1982లో వెంచర్‌ ఏర్పాటు చేశారు. ఇందుకు ‘కుడా’ అనుమతి తీసుకున్నారు. ఈ వెంచర్‌లో పార్క్‌ కోసం స్థలం కేటాయించారు. 15 ఏళ్ల క్రితం పార్క్‌ కోసం కేటాయించిన స్థలంలోని కొంత భూమిలో గ్రంథాలయం నిర్మించారు. అప్పటి గ్రంథాలయ చైర్మన్‌, ప్రస్తుత ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కాగా, గ్రంథాలయం కూల్చివేత వల్ల సుమారు రూ.5లక్షల విలువైన ఫర్నిచర్‌ ధ్వంసమైందని కాలనీ అధ్యక్షుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రంథాలయంలో భద్రపర్చిన మెటీరియల్‌ కూడా ధ్వంసమైనట్లు తెలిపారు.

బెదిరింపులు..

గ్రంథాలయ భవనాన్ని కూల్చివేస్తుండగా అడ్డుకోవడానికి వచ్చిన కాలనీ కమిటీ సెక్రటరీ కిశోర్‌, స్థానికుడు మహ్మద్‌ అక్బర్‌ అలీని భూకబ్జా ముఠా బెదిరింపులకు గురిచేసినట్లు కాలనీ కమిటీ అధ్యక్షుడు కొక్కిరాల రవీందర్‌రావుతో పాటు సభ్యులు కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రంథాలయాన్ని కూల్చేస్తున్న వీడియో సీసీ ఫుటేజీలో నమోదైనట్లుగా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎస్సారెస్పీ భూముల కబ్జా1
1/3

ఎస్సారెస్పీ భూముల కబ్జా

ఎస్సారెస్పీ భూముల కబ్జా2
2/3

ఎస్సారెస్పీ భూముల కబ్జా

ఎస్సారెస్పీ భూముల కబ్జా3
3/3

ఎస్సారెస్పీ భూముల కబ్జా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement