వడ్డీ జలగలపై నిఘా
● వివరాల సేకరణలో పోలీసులు
కాజీపేట: ‘వడ్డీ జలగలు’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పోలీస్ అధికారులు స్పందించారు. కాజీపేటలో రెచ్చిపోతున్న గిరిగిరి వ్యాపారులపై ప్రత్యేక దృష్టి సారించారు. సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఫైనాన్స్ వ్యాపారుల ఆగడాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, సీఐ సుధాకర్‌రెడ్డి పర్యవేక్షణలో క్రైం పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు. తమ కదలికలను తెలుసుకుంటున్నట్లుగా సమాచారం అందుకున్న ఫైనాన్స్ వ్యాపారులు శుక్రవారం సాయంత్రం నుంచి వసూళ్ల కోసం అడ్డాల మీదకు రాలేదు. భూములు, ప్లాట్లు కుదువ పెట్టుకుని డబ్బులు ఇచ్చే వారి జాబితాతో పాటు బలవంతంగా లక్కున్న ఘటనలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఫైనాన్స్ వ్యాపారులు వణికిపోతున్నారు.
నయీంనగర్: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత జనం బాట పట్టారని ఆ సంస్థ వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, రాష్ట్ర అధికార ప్రతినిధి డా.నలమాస శ్రీకాంత్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. శనివారం కాజీపేట మండలం టేకులగూడెంలో వరి పంట పరిశీలన, సమ్మయ్య నగర్‌లో వరద ముంపు బాధితుల పరామర్శ, ఎంజీఎం, సీకేఎం ఆస్పత్రి, ఎస్‌ఆర్ నగర్ ప్రాంతాల్ని సందర్శిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మ రిపల్లి మాధవి, నాయకులు పర్లపల్లి శ్రీశైలం, మాకల రాణి, వంశీకృష్ణ, కిషోర్, సంతోశ్ త దితరులు పాల్గొన్నారు.
వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ చెస్ అసోసియేషన్ సహకారంతో వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించాల్సిన టోర్నమెంట్‌ను అనివార్య కారణాలతో ఒకే రోజుకు కుదించినట్లు నిర్వహణ కార్యదర్శి పి.కన్నా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓపెన్ టు ఆల్ కేటగిరీలో నిర్వహించే ఈ పోటీలను హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలో తిరుమల తిరుపతి ఆలయ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు ప్రశంసపత్రాలు, వ్యక్తిగత పతకాలు, ట్రోఫీలు బహూకరించనున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనాలనుకున్న క్రీడాకారులు పేర్లు నమోదు, ఇతర వివరాల కోసం 90595 22986 మొబైల్ నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు. మార్పును క్రీడాకారులు, తల్లిదండ్రులు గమనించి సహకరించాలని కోరారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో రెండో చోట్ల అభివృద్ధి పనులకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రంతో కలిసి కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. కేయూ దూరవిద్య కేంద్రం భవనంలోని మొదటి అంతస్తులో రూ.2 కోట్ల వ్యయంతో దూరవిద్య కేంద్ర పరిపాలన భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే, పరీక్షల విభాగంలో రూ.1.67 కోట్ల ఖర్చుతో స్టోర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో కేయూ పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ సురేశ్‌లాల్, డాక్టర్ రమ, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ చిర్ర రాజు, ప్రొఫెసర్ మల్లం నవీన్, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ రాజేందర్ పాల్గొన్నారు.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంలో సాలహారం(ప్రహరీ) నిర్మాణ పనులు సాగుతున్నాయి. రాతితో సాలహారం నిర్మించనున్నారు. ప్రస్తుతం పిలర్లపై బీమ్‌లను నిర్మిస్తున్నారు. 90 రోజుల్లో ప్రహరీ నిర్మాణం పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు సంబంధిత కాంట్రాక్టర్లు ఆదిశగా పనులు చేపడుతున్నారు.
వడ్డీ జలగలపై నిఘా
వడ్డీ జలగలపై నిఘా
వడ్డీ జలగలపై నిఘా


