జిల్లా జడ్జిగా సుజయ్‌కి పదోన్నతి
పరకాల: మిర్యాలగూడ సీనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్న పరకాల పట్టణానికి చెందిన బొచ్చు సుజయ్ జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన హైదరాబాద్ 7వ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన తండ్రి మాజీ మంత్రి బొచ్చు సమ్మయ్య స్ఫూర్తితో న్యాయవాద వృత్తిలో రాణిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తన పదోన్నతి వివరాలు వెల్లడించారు. సుజయ్ నియామకంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఎల్కతుర్తి: భీమదేవరపల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న స్టాలిన్‌కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు ముల్కనూరు ఎస్సై రాజు శుక్రవారం తెలిపారు. స్టాలిన్ భార్య ఆఫ్రాజ్, కూతురు సిద్ధిఖీపై హత్యాయత్నం చేశాడని అతడి అత్త భాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రాజు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం స్టాలిన్‌ను కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు ఎస్సై రాజు తెలిపారు.


