రోడ్ల ఆక్రమణలపై చర్యలు షురూ
నోటీసులు అందినా పట్టించుకోని యజమానులు.. ఇళ్ల కూల్చివేత
పరకాల: నోటీసులు జారీ చేసినా పట్టించుకోకుండా రోడ్ల ఆక్రమణలపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ హె చ్చరించారు. పరకాల మున్సిపాలిటీ పరిధి పాత సీఎంఎస్ గోదాం ప్రహరీ నిర్మాణంపై ఫిర్యాదులు రావడంతో ఆమె స్పందించారు. కమిషనర్ ఆదేశాల మేరకు రోడ్డు ఆక్రమణపై టౌన్ ప్లానింగ్ అధి కారులు చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీ రోడ్డు ఆక్రమణపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. నోటీసులు అందినవారు తక్షణమే ఆక్రమణలు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.


