కమ్యూనిటీ హాళ్లను స్వాధీనం చేసుకోవాలి
వరంగల్ అర్బన్: మహానగరవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ హాళ్లను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. గురువారం కమిషనర్, టౌన్ ప్లానింగ్, పన్నుల విభాగం అధికారులు హనుమకొండలోని టీఎన్జీఓస్ కాలనీలోని రోజ్ గార్డెన్‌ను సందర్శించారు. గార్డెన్‌ను స్వాధీనం చేసుకోవడంతోపా టు బల్దియా పేరిట బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో సుమారు 60 నుంచి 80 వరకు ఉన్న కమ్యూనిటీ హాళ్లలో సగం వరకు బల్దియా ఆధ్వర్యంలో ఉన్నాయని తెలిపారు. మిగతా సగం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయని, వారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు వాటి జాబితాను అధికారులు నివేదించాలన్నారు. ఎవరైనా హాల్ బుక్ చేసుకోవాలనుకుంటే ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చని.. ఒక ఫంక్షన్‌కు రూ.20 వేలు, అదనంగా విద్యుత్ చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు.
పురాతన కట్టడాలు..
బావుల్ని పునరుద్ధరించండి
నగరంలో స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (సాస్కి) పథకం అమలులో భాగంగా పురాతన కట్టడాలు, బావుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. గురువారం హనుమకొండ‘ కుడా’ కార్యాలయంలో సాస్కి పథకంపై ఆయా విభాగాల అధికారులతో చర్చించారు. సమావేశంలో ఎస్‌ఈ సత్యనారాయణ, ‘కుడా’ సీపీఓ అజిత్‌రెడ్డి, సీఎంహెచ్‌ఓ డా.రాజారెడ్డి సీహెచ్‌ఓలు రమేశ్, లక్ష్మారెడ్డి, ఈఈలు రవికుమార్, సంతోశ్‌బాబు, డీఈలు రవికిరణ్, శివానంద్, స్మార్ట్ సిటీ పీఎంసీ ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు.
టీఎన్జీఓస్ కమ్యూనిటీ హాల్ స్వాధీనం
హన్మకొండ: హనుమకొండ ఎన్జీఓస్ కాలనీలోని టీఎన్జీఓస్ కమ్యూనిటీ హాల్‌ను బల్దియా స్వాధీనం చేసుకుంది. గురువారం ఉదయం అధికారులు టీఎన్జీఓస్ కమ్యూనిటీ హాల్‌కు తాళం వేసి వెళ్లారు. సాయంత్రం తాళం తీసి ఈ కమ్యూనిటీ హాల్‌ను తామే నిర్వహించనున్నట్లు, శుభకార్యాలు, ఈవెంట్లకు అద్దెకు ఇవ్వనున్నట్లు బ్యానర్ ఏర్పాటు చేశారు. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, తామంతా వ్రతాలు, పూజా కార్యక్రమాల్లో ఉండగా.. వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు చేరుకుని తాళం వేసినట్లు టీఎన్జీఓస్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కొక్కిరాల రవీందర్‌రావు, కార్యదర్శి కిశోర్ తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో మాట్లాడతానని చెప్పారన్నారు.
విందుకు రూ.20 వేల చొప్పున
చార్జీ విధించాలి
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్


