
పోరాటయోధుడు కొమురం భీమ్
కేయూ క్యాంపస్ : ఆదివాసీల హక్కులు, ఆస్థిత్వం కోసం పోరాటం చేసిన యోధుడు కొమురం భీమ్ అని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం కేయూ ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో కొమురం భీమ్ జయంతిని పురస్కరించుకొని రిజిస్ట్రార్ వి.రామచంద్రంతో కలిసి భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, పాలక మండలి సభ్యులు ప్రొఫెసర్ బి.సురేష్‌లాల్, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ ఎ.రాజు, డాక్టర్ సుకుమారి, ఎం.నవీన్, వల్లాల పృథ్వీరాజ్ వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్ : హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ కోర్సులు బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు నవంబర్ 14వరకు నిర్వహించనున్నారు. ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ పర్యవేక్షించారు. డాక్టర్ మంద శ్రీనివాస్, శ్రీదేవి అధ్యాపకులు ఉన్నారు.
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ జువాలజీ విభాగం అధిపతిగా అదే విభాగం ప్రొఫెసర్ వై.వెంకయ్య నియమితులయ్యారు. బుధవారం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటి వరకు ఆ విభాగం అధిపతిగా విధులు నిర్వర్తించిన ప్రొఫెసర్ జి.షమిత పదవీకాలం పూర్తికావడంతో ఆమె స్థానంలో వెంకయ్యను నియమించారు. రెండేళ్ల పాటు ఆయన విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం ఆయన కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో వివిధ విభాగాల పరిశోధకులకు బుధవారం ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 187 మంది పరిశోధకులకు గాను 180 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల నిర్వహణను కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం పరిశీలించారు. ప్రొఫెసర్ కె.రాజేందర్, యూనివర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.మనోహర్, ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పి.శ్రీనివాస్, మమత పాల్గొన్నారు.
కాజీపేట అర్బన్ : హనుమకొండ జిల్లా (వరంగల్ అర్బన్)లోని 67 వైన్స్‌లకు గాను బుధవారం జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌కు 16 దరఖాస్తులు అందజేశారు. వైన్స్ టెండర్ల ప్రక్రియ వెలువడిన నాటి నుంచి బుధవారం వరకు 3,036 దరఖాస్తులు అందాయి. కాగా పొడిగించిన టెండర్ల గడువు నేటి (గురువారం)తో ముగియనుంది.
ఆత్మకూరు : వైద్యసిబ్బంది అంకితభావంతో పనిచేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య సూచించారు. మండలంలోని నీరుకుళ్ల, పెద్దాపూర్, పెంచికలపేట ఉప ఆరోగ్య కేంద్రాలను బుధవారం ఆయన తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు.ప్రజలకు పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు రాజమ్మ, హేమలత, సజీన, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పోరాటయోధుడు కొమురం భీమ్

పోరాటయోధుడు కొమురం భీమ్

పోరాటయోధుడు కొమురం భీమ్