
రాష్ట్రస్థాయి బృంద గీతాల పోటీల్లో ప్రతిభ
హనుమకొండలో బాణసంచా విక్రయిస్తున్న వ్యాపారులు
దీపావళి పండుగను పురస్కరించుకుని వరంగల్, హనుమకొండ, కాజీపేటలో కొనుగోళ్లు జోరందుకున్నాయి. కుండీలు, ప్లేట్లు, బాతులు, తాబేలు, దీపం, గిన్నెల వంటి ఆకృతుల్లో తయారైన సంప్రదాయ మట్టి ప్రమిదలతోపాటు బాణసంచా, పూలు,పండ్లను ప్రజలు కొనుగోలు చేశారు. దీంతో నగరంలోని ప్రధాన రహదారులు సందడిగా మారాయి.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హనుమకొండ
విద్యారణ్యపురి : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పీఎన్‌ఎం హైస్కూల్‌లో భారత్ వికాస్ పరిషత్ కమిటీ ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి జాతీయ బృంద గీతాల పోటీల్లో ఓరుగల్లు విద్యార్థులు ప్రతిభ చూపారు. తెలంగాణ రాష్ట్రస్థాయి బృంద గీతాల పోటీల్లో 30 పాఠశాలల విద్యార్థులు పాల్గొనగా తెలుగు, జానపదం విభాగం (రూరల్) వరంగల్‌లోని నాగార్జున ప్రైమ్ స్కూల్ విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు. విజేతలకు మెమోంటో, సర్టిఫికెట్లు అందజేశారు. పాఠశాల కరస్పాండెంట్ ఎ.వెంకటేశ్వర్లు, బీవీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సుధీర్‌కుమార్, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, బాధ్యులు వెంకటరెడ్డి తదితరులు ఆదివారం అభినందించారు.

రాష్ట్రస్థాయి బృంద గీతాల పోటీల్లో ప్రతిభ

రాష్ట్రస్థాయి బృంద గీతాల పోటీల్లో ప్రతిభ

రాష్ట్రస్థాయి బృంద గీతాల పోటీల్లో ప్రతిభ

రాష్ట్రస్థాయి బృంద గీతాల పోటీల్లో ప్రతిభ