మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025

Jul 29 2025 4:28 AM | Updated on Jul 29 2025 10:36 AM

8లోu

చూడడానికి డిఫరెంట్‌గా ఉండే వైట్‌ టైగర్‌ (శరణ్‌, 13 సంవత్సరాలు మగ) పుట్టి పెరిగింది భాగ్యనగరంలోనే. హైదరాబాద్‌ నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లో 2012,అక్టోబర్‌ 20న జన్మించింది. శరణ్‌ తండ్రి పేరు బద్రి, తల్లిపేరు సురేఖ అని అటవీ రేంజ్‌ అధికారి మయూరి తెలిపారు. శరణ్‌ బరువు (180 కేజీలు) వరకు ఉంటుంది. దీని జీవితకాలం 15 ఏళ్లు. త్వరలో ఆడ తెల్లపులిని కూడా జూకి తీసుకొస్తామని వారు పేర్కొన్నారు.

లీటర్‌ మిల్క్‌.. కేజీ చికెన్‌

ప్రతీరోజు ఉదయాన్నే రెండు ఎగ్స్‌, లీటర్‌ మిల్క్‌, కిలో చికెన్‌ను శరణ్‌కు అందిస్తారు. ఆర్‌ఓ ప్లాంట్‌ వాటర్‌నే తాగిస్తారు. పులి ఆరోగ్యంగా ఉండేందుకు ఎలక్ట్రాల్‌ పౌడర్‌, కాల్షియం సప్లిమెంట్స్‌తో కూడిన ద్రావణాన్ని అందిస్తారు. అనంతరం ఎన్‌క్లోజర్‌లోకి వదులుతారు. సాయంత్రం జూ క్లోజ్‌ అయ్యే వరకు ఎన్‌క్లోజర్‌లో సందర్శకులు వీక్షించేందుకు ఉంచుతారు.

భారీ ఆహార్యం.. నడకలో రాజసం.. గాండ్రింపులో గాంభీర్యం.. దాన్ని చూస్తే ఏ జంతువైనా పారిపోవాల్సిందే. అలాంటి తెల్ల పులి(శరణ్‌)ని సందర్శకుల కోసం ఇటీవల వరంగల్‌ కాకతీయ జూలాజికల్‌ పార్క్‌కు తీసుకొచ్చారు. క్రూర మృగాల్ని చూడాలన్నా.. చాలా మందికి భయమే కానీ.. ఆ భయం వెనుక వాటి గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా దాగి ఉంటుంది. అందులో భాగంగానే శరణ్‌ (వైట్‌ టైగర్‌) గురించి ‘సాక్షి’ కొన్ని ఆసక్తికర అంశాలు సేకరించింది. నేడు (మంగళవారం) అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మన తెల్ల పులిపై ప్రత్యేక కథనం. – న్యూశాయంపేట

జూలో

సందడే.. సందడి

వరంగల్‌ నగరంలోని కాకతీయ జూలాజికల్‌ పార్క్‌లో సందర్శకులకు తెల్ల పులి కనువిందు చేస్తోంది. ఈ నెల 18వ తేదీన తెల్లపులిని బోనులో నుంచి ఎన్‌క్లోజర్‌లోకి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ విడుదల చేశారు. ఈ తెల్లపులిని చూసేందుకు నగర వాసులు, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సందర్శకులు ఆసక్తిచూపుతున్నారు.

బోన్‌లెస్‌ అంటే ఇష్టం..

తెల్లపులి (శరణ్‌) బోన్‌లెస్‌ మాంసాన్ని ఇష్టంగా తింటుంది. అందులో భాగంగా వాటికి ప్రత్యేకంగా బీఫ్‌ మాంసాన్ని రోజుకు 6 కేజీల చొప్పున పెడుతున్నామని జూ పార్క్‌ వెటర్నరీ డాక్టర్‌ కార్తికేయ తెలిపారు. జంతు ప్రదర్శన శాలలో తెల్ల పులులకు బీఫ్‌ను మాత్రమే అందిస్తారని ఆయన పేర్కొన్నారు. వీటిలో లివర్‌, హార్ట్‌, స్ల్పీన్‌ ఇష్టంగా తింటుందని తెలిపారు. ప్రతీ శనివారం తెల్లపులిని ఉపవాసం ఉంచుతామని, ఆరోగ్య రీత్యా ఇది అవసరమని డాక్టర్‌ చెబుతున్నారు. ఆ రోజంతా లవణాలతో కూడిన నీటిని అందిస్తామంటున్నారు.

శరణ్‌ అని పిలిస్తే చాలు..

ఉదయం నుంచి రాత్రి వరకు బాగోగులు చూసే టైగర్‌ కేర్‌ టేకర్‌ మూర్తి శరణ్‌ అని పిలిస్తే చాలు.. పరిగెత్తుకుంటూ వస్తుంది వైట్‌ టైగర్‌. అతను పెట్టిన ఆహారాన్ని తింటుంది. పులికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ దాని ఆలనాపాలన చూస్తూ కేర్‌టేకర్‌ అన్నీ గమనిస్తూ ఉంటాడు.

తెల్లపులి పుట్టి పెరిగింది హైదరాబాద్‌ జూ లోనే..

డేట్‌ ఆఫ్‌ బర్త్‌ : 2012, అక్టోబర్‌ 20

బోన్‌లెస్‌ మటన్‌ అంటే ఇష్టం.. శనివారం రోజంతా ఫాస్టింగ్‌

కాకతీయ జూ పార్కులో ప్రత్యేక ఆకర్షణ

ఆసక్తికర విషయాలు వెల్లడించిన జూ పార్క్‌ అధికారులు

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 20251
1/4

మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025

మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 20252
2/4

మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025

మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 20253
3/4

మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025

మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 20254
4/4

మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement