
ఉచిత ప్రయాణంతో మహిళలకు గౌరవం
నేను ఔట్‌సోర్సింగ్ ప్రైవేట్ ఉద్యోగిని. రోజూ ముల్కనూరు నుంచి హనుమకొండకు వచ్చి వెళ్తాను. జనరల్ పాస్ తీసుకోవడం ద్వారా నెలకు రూ.960 చార్జీలు అయ్యేవి. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఇప్పుడు నాకు ఆ డబ్బులు మిగులుతున్నాయి. ఉచిత ప్రయాణంతో మహిళలకు ప్రభుత్వం తగిన గౌరవం కల్పించింది.
– పావని, ముల్కనూరు, ప్రయాణికురాలు
డబ్బులు ఆదా అవుతున్నాయి
ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా డబ్బు ఆదా అవుతోంది. నాకు నెలకు రూ.2వేలు బస్సు చార్జీలు అయ్యేవి. ఇప్పుడు ఈ ఖర్చులు ఆదా అవుతున్నాయి. పేద మహిళలకు ఉచిత ప్రయాణం ఎంతో మేలు చేస్తోంది.
– సుమలత, మడికొండ, ప్రైవేట్ ఉద్యోగి
మెరుగైన సేవలందిస్తున్నాం..
మహిళలకు ఉచిత ప్రయాణ బస్సు సౌకర్యంతో ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఈమేరకు ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తున్నాం. రద్దీ ఉన్న రూట్లలో బస్సుల సంఖ్య పెంచాం. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నాం. – డి.విజయ భాను,
ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్

ఉచిత ప్రయాణంతో మహిళలకు గౌరవం

ఉచిత ప్రయాణంతో మహిళలకు గౌరవం