
పేలుడు పదార్థాలు స్వాధీనం
ధర్మసాగర్ : మండలంలోని పెద్దపెండ్యాలలో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు మంగళవారం అందిన సమాచారంతో పేలుడు పదార్థాల నిల్వలపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ కథనం ప్రకారం.. పెద్దపెండ్యాలకు చెందిన ఒర్సు మహేందర్ ఇంట్లో అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీ చేశారు. ఎస్‌ఎస్‌ఓ డిటోనేటర్స్ 1,100, సేఫ్టీ ఫీజులు 4, ఐడియల్ పవర్ స్టిక్స్ 38, కార్డ్ డెస్క్ బండిల్స్ 30 మీటర్లు, సెల్ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువలు దాదాపు రూ.66,400 ఉంటుందని, తదుపరి చర్యల నిమిత్తం ధర్మసాగర్ పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. తని ఖీల్లో టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజు, భానుప్రకాశ్, ఆర్‌ఎస్సై, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.