
మహిళా సాధికారతే లక్ష్యం
పరకాల: మహిళా సాధికారతే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మహిళల స్వావలంబన దిశగా నిరంతరం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. అవసరమైతే వచ్చే నాలుగేళ్లలో మహిళల సంక్షేమానికి రూ.1 లక్ష కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పరకాలలోని వెల్లంపల్లి రోడ్డులో మహాదేవ ఫంక్షన్‌హాల్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో.. పరకాల నియోజకవర్గ స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబురాలు గురువారం నిర్వహించారు. ఈసంబురాలకు ముఖ్య అతిథిగా హాజరైన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్యశారదతో కలిసి కొత్త రేషన్‌కార్డులు, వడ్డీలేని రుణాలతో పాటు బీమా చెక్కులు మహిళళా సంఘాల సభ్యులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ముల్కనూరు డెయిరీ తరహాలో పరకాల నియోజకవర్గంలో రూ.32 కోట్లతో కొత్త డెయిరీ ఏర్పాటు చేసి మహిళాల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తామని తెలిపారు. కలెక్టర్ స్నేహ శబరీష్, డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, రుణాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీను, ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ, పరకాల ఏసీపీ సతీశ్‌బాబు, పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, మాజీ కౌన్సిలర్ పంచగిరి జయమ్మ పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
ఘనంగా ఇందిరా మహిళా శక్తి
సంబురాలు