పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వరుస చోరీలు | - | Sakshi
Sakshi News home page

పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వరుస చోరీలు

Jul 16 2025 3:17 AM | Updated on Jul 16 2025 3:17 AM

పోలీస

పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వరుస చోరీలు

రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన తుమ్మ సావిత్రమ్మ దంపతులు ఆరుబయట నిద్రలో ఉన్న సమయంలో ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును

గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు.

పర్వతగిరి మండలం చింతనెక్కొండ శివారులోని తన తోటలో పండించిన డ్రాగన్‌ ఫ్రూట్స్‌ను వృద్ధురాలైన నల్లపు స్వర్ణలత రహదారి పక్కనే పెట్టి అమ్ముతుండగా బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని పరారయ్యారు. ఆమె ప్రతిఘటించినా ప్రయోజనం లేకుండా పోయింది.

వర్ధన్నపేట పట్టణ శివారు ప్రాంతంలోని డీసీ తండాకు చెందిన బానోతు పూరి (65) అనే మహిళ వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారి పక్కనే కిరాణ దుకాణంలో ఒంటరిగా ఉన్న సమయంలో వాటర్‌ బాటిల్‌ కావాలంటూ వచ్చిన దుండుగులు ఆమైపె దాడి చేసి మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడు లాకెళ్లారు. ఈ క్రమంలో దుండగులకు బాధితురాలికి మధ్య గలాటా చోటుచేసుకుంది. ఈ గలాటలో నిందితుల క్యాప్‌, ఓ బ్లాంకెట్‌ అక్కడే వదిలి వెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల జాడ కోసం గాలిస్తున్నారు.

నెక్కొండ మండలం పనికర గ్రామంలో బండారి యాకయ్య కిరాణం దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయన బయటికెళ్లిన సమయంలో అతని భార్య నిరోష షాపులో ఒంటరిగా ఉండగా.. మాస్కులు, హెల్మెట్‌ ధరించి వచ్చిన దుండగులు ఆమెను కత్తితో బెదిరించి మెడలోని బంగారు ఆభరణాలతోపాటు ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు నెక్లెస్‌, రూ.2,32,000 దోచుకెళ్లారు.

సాక్షి, వరంగల్‌: ఒకప్పుడు దొంగలు ఇళ్లలోని నగదు, బంగారు ఆభరణాలు, ఖరీదైన వస్తువులు అపహరించేవారు. కానీ, ప్రస్తుతం బంగారం మాత్రమే టార్గెట్‌గా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఈమధ్యకాలంలో జిల్లాలో జరిగిన దొంగతనాలు పోలీసులకు సవాల్‌గా మారాయి. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి మెడలోని బంగారు గొలుసులను దొంగలు తెంచుకొని పరారవుతున్నారు. ఈ తరహా చోరీలు వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌పరిఽధిలో ఇటీవల పెరగడంతో మహిళల్లో భయాందోళన నెలకొంది. ముఖ్యంగా కిరాణషాపులు, రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు చేసే మహిళలు, వ్యవసాయ పొలాల్లో ఒంట రిగా పనిచేస్తున్న మహిళలు, ఇంటి ఆరు బయట నిద్రిస్తున్న మహిళలను టార్గెట్‌ చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు ‘చైన్‌ స్నాచింగ్‌’ చేస్తుండడం కలవరపెడుతోంది. వరంగల్‌ జిల్లాలోనే ఇటీవలి కాలంలో నాలుగు దొంగతనాలు జరగ డం పోలీసులకు కూడా సవాల్‌గా మారింది. ఏ ఒక్క కేసులోనూ ఇప్పటివరకు ఒక్కరినీ అరెస్టు చేయకపోవడంతో పోలీసుల పనితీరుపై విమర్శలొస్తున్నాయి. సాంకేతికత పెరిగిన నేటి కాలంలో దొంగలు దొరక్కుండా పోలీసులకు సవాల్‌ విసరడం, ఎక్కడా కూడా తగ్గకుండా మళ్లీ చైన్‌ స్నాచింగ్‌లు చేస్తుండడంతో పోలీసుల పనితీరుపై నమ్మకం లేకుండా పోతుందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మెడలోని బంగారు పుస్తెలు తాడును పవిత్రంగా భావించే మహిళలు దొంగలను త్వరగా గుర్తించి తమ ఆభరణాలను అందజేయాలని కోరుతున్నారు.

రూ.లక్షలు వస్తాయనే..

తులం బంగారం ధర మార్కెట్లో రూ.లక్ష వరకు ఉంది. అందుకే దొంగలు గతంలో మాదిరిగా ఇళ్లలోకి వెళ్లి నగదు, నగలు చోరీ చేయడం కాకుండా తమ పంథా మార్చి కేవలం చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతూ భయాందోళన కలిగిస్తున్నారు. ఒంటరి మహిళలు, వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుంటే వారు ప్రతిఘటించినా దొరికే అవకాశం లేకపోవడం, ఒక్కరిని టార్గెట్‌ చేసినా రెండు తులాలపైనే గొలుసులు ఉండే అవకాశం ఉండడంతో రూ.రెండు లక్షలు గిట్టుబాటు అవుతాయనే ఉద్దేశంతో ఈ నేరాలు చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇటీవల జరిగి న చైన్‌ స్నాచింగ్‌ ఘటనల్లో రెక్కీ నిర్వహించాకే అదను చూసుకొని ఈ దొంగతనాలు చేశారని భావిస్తున్నారు.

ఎక్కడి దొంగలు..?

జిల్లాలో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడింది స్థానిక దొంగలా.. లేదా అంతర్రాష్ట్ర ముఠా దొంగలా..? అన్న విషయంలో పోలీసులు ఏం చెప్పడంలేదు. అయితే ఈ ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించినా క్షేత్రస్థాయిలో పోలీసులు అనుకున్నంత స్పీడ్‌ లేకపోవడంతో నిందితులను పట్టకోలేకపోతున్నారన్న టాక్‌ ఉంది. ఇదిలాఉండగా.. ఒంటరి మహిళలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు.

జూన్‌

23

జూలై

7

జూలై

15

జూలై

11

బంగారు ఆభరణాలే టార్గెట్‌

పోలీసులకు సవాల్‌గా మారిన చైన్‌స్నాచింగ్‌లు

భయాందోళనలో మహిళలు, వృద్ధులు

పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వరుస చోరీలు1
1/1

పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వరుస చోరీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement