
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
రాయపర్తి: అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో రాయపర్తి పట్టణకేంద్రానికి చెందిన 62 మంది లబ్ధిదారులకు మంగళవారం అధికారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏండ్లనాటి సొంతింటి కల నెరవేరుతుందన్నారు. ఇప్పటి వరకు పాలకుర్తి నియోజకవర్గంలో 3,200 ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో అందించే సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శనీయమని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధిపథంలో నడుస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఘన విజయం సాధించేలా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి నాగమణి, తహసీల్ధార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్‌నాయక్, ఎంపీఓ కూచన ప్రకాష్, తొర్రూరు బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యానాయక్, మండలపార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా రైతువేదిక ఆరవణలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి