
కేఎంసీ ప్రిన్సిపాల్‌గా సంధ్య
ఎంజీఎం: కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ ఎస్.సంధ్య నియమితులయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన ఆస్పత్రుల్లో ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లుగా నియామకానికి ఇటీవల 44 మంది ప్రొఫెసర్లకు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (అడిషనల్ డీఎంఈ)గా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ నేపథ్యంలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న సంధ్యకు అడిషనల్ డీఎంఈగా పదోన్నతి కల్పించి కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కేఎంసీ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆమె ఫారిన్ డిప్యుటేషన్ సర్వీస్ (ఎఫ్‌డీఎస్)పై కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
పోలీస్ కుటుంబాలకు
చెక్కుల అందజేత
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తూ పలు కారణాలతో గత సంవత్సరం మరణించిన ఎస్సై నర్సింహారావు కుటుంబానికి రూ.15,92,134, మరో హెడ్‌కానిస్టేబుల్ శ్రీరాం రాజు కుటుంబానికి రూ.15,22,983 విలువైన చెక్కులను మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అందజేశారు. ఈ సందర్భంగా మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబ స్థితిగతులపై సీపీ ఆరా తీశారు. కార్యక్రమంలో ఏఓ సంపత్ కుమార్ పాల్గొన్నారు.
అందరి సహకారంతో
అభివృద్ధి : ‘కుడా’ చైర్మన్
నయీంనగర్: అందరి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు చేసినట్లు కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి పేర్కొన్నారు. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం కుడా కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా వచ్చే నాలుగేళ్లలో చేపట్టనున్నపనులు, వరంగల్ మాస్టర్‌ప్లాన్ –2041పై చర్చించారు. సమావేశంలో జీడబ్లూఎంసీ కమిషనర్, కుడా వైస్ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయ్, పీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, జేపీఓ, ఏపీఓ తదితరలు పాల్గొన్నారు.

కేఎంసీ ప్రిన్సిపాల్‌గా సంధ్య