అట్టహాసంగా ‘ఐ–స్టెమ్‌ సమావేశ–12’ | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా ‘ఐ–స్టెమ్‌ సమావేశ–12’

Jul 10 2025 8:18 AM | Updated on Jul 10 2025 8:18 AM

అట్టహ

అట్టహాసంగా ‘ఐ–స్టెమ్‌ సమావేశ–12’

కాజీపేట అర్బన్‌: తెలంగాణలో తొలి ఐ–స్టెమ్‌ సమావేశాన్ని ‘ఐ–స్టెమ్‌ సమావేశ–12’ పేరిట నిట్‌ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించారు. నిట్‌ స్టూడెంట్‌ వెల్ఫేర్‌ డీన్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఐ–స్టెమ్‌ వెబ్‌పోర్టల్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. భారతదేశంలో శాసీ్త్రయ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు నిట్‌ వరంగల్‌, ఓప్‌సా (ఆఫీస్‌ ఆఫ్‌ ది ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌) సౌజన్యంతో ఐ–స్టెమ్‌(ఇండియన్‌ సైన్స్‌ టెక్నాలజీ అండ్‌ ఇంజనీరింగ్‌ ఫెసిలిటీస్‌ మ్యాప్‌) వెబ్‌పోర్టల్‌ తోడ్పడుతుందన్నారు. నిట్‌లోని సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఫెసిలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రొఫెసర్లు హరిలాల్‌, శిరీష్‌, వీరేశ్‌బాబు, రవికుమార్‌, సునీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీ గురుకులంలో

ఆకస్మిక తనిఖీ

న్యూశాయంపేట: హనుమకొండ జిల్లా పరిధి ఒగ్లాపూర్‌ సైలానీబాబా దర్గా వద్ద ఉన్న పరకాల(బీ1) బాలుర మైనార్టీ గురుకులాన్ని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి(డీఎండబ్ల్య్లూఓ) కేఏ గౌస్‌ హైదర్‌ బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుశాతం, మైనార్టీ, నాన్‌మైనార్టీ సీట్ల కేటాయింపు వివరాల్ని ప్రిన్సిపాల్‌ రమేశ్‌లాల్‌ హట్కర్‌ను అడిగి తెలుసుకున్నారు. 5వ తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో సీట్లు ఏ మేరకు భర్తీ అయ్యాయో ఆరా తీశారు. కిచెన్‌హాల్‌, డైనింగ్‌, స్టోర్‌రూమ్‌ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

తహసీల్దార్లకు స్థానచలనం

హన్మకొండ అర్బన్‌: జిల్లాలో తహసీల్దార్లకు స్థానచలనం కల్పిస్తూ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర జిల్లా నుంచి ఇటీవల వచ్చిన తహసీల్దార్‌ రాణికి నడికూడ తహసీల్దార్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. నడికూడ తహసీల్దార్‌గా ఉన్న రవీందర్‌రెడ్డిని హనుమకొండకు బదిలీ చేశారు. అదేవిధంగా కలెక్టరేట్‌లో ఎన్నికల విభాగ సూపరింటెండెంట్‌గా ఉన్న ఏవీఎన్‌ ప్రసాద్‌ను ఎల్క తుర్తి తహసీల్దార్‌గా నియమించారు. ఎల్కతుర్తిలో పని చేస్తున్న జగత్‌సింగ్‌ను కలెక్టరేట్‌కు బదిలీ చేశారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ లీగల్‌

కౌన్సిల్‌గా వీరభద్రరావు

వరంగల్‌ లీగల్‌ : వరంగల్‌ జిల్లా కోర్టు పరిధిలో గల కేసుల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ పక్షాన న్యాయవాదిగా పి.వీరభద్రరావును నియమిస్తూ అ సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వీరభద్రరావు ఈపదవిలో మార్చి –2026వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేదాక కొనసాగుతారని పేర్కొన్నారు. ఈమేరకు వీరభద్రరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా వీరభద్రరావును పలువురు న్యాయవాదులు కలిసి అభినందనలు తెలిపారు.

ఇంతేజార్‌ గంజ్‌ సీఐకి

అత్యుత్తమ పురస్కారం

వరంగల్‌ చౌరస్తా: విధుల్లో అత్యుత్తమ సేవలందించినందుకు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక సేవ పతకానికి వరంగల్‌ ఇంతేజార్‌ గంజ్‌ సీఐ షుఖూర్‌ ఎంపికయ్యారు. ఈమేరకు బుధవారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఉత్తమ సేవలకుగాను అవార్డును ఎంపిక చేశారు. ఈసందర్భంగా సీఐ షుఖూర్‌కు సీఐలు, ఎస్‌ఐలు, పోలీసులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

నేడు మేధస్సు సంపత్తి

హక్కులపై అవగాహన

రామన్నపేట: నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో గురువారం (నేడు) ‘ఆవిష్కరణను ప్రోత్సహించడం, సృజనాత్మకతను పరిరక్షించడం’ అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బైరి ప్రభాకర్‌ బుధవారం తెలిపారు. పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, డిజైన్లు, కాపీరైట్లు, భౌగోళిక సూచికలు వంటి అంశాలపై నిపుణుల ద్వారా ఉపన్యాసాలు, అనుభవాల వివరణలు ఉంటాయని పేర్కొన్నారు. వివరాలకు 94910 56452, 99124 22004 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

అట్టహాసంగా  ‘ఐ–స్టెమ్‌ సమావేశ–12’1
1/3

అట్టహాసంగా ‘ఐ–స్టెమ్‌ సమావేశ–12’

అట్టహాసంగా  ‘ఐ–స్టెమ్‌ సమావేశ–12’2
2/3

అట్టహాసంగా ‘ఐ–స్టెమ్‌ సమావేశ–12’

అట్టహాసంగా  ‘ఐ–స్టెమ్‌ సమావేశ–12’3
3/3

అట్టహాసంగా ‘ఐ–స్టెమ్‌ సమావేశ–12’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement