
వైద్య కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
నర్సంపేట రూరల్ : నర్సంపేట వైద్య కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, సిబ్బంది నియామకం, ఇతర అవసరాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌దాస్, సూపరింటెండెంట్ కిషన్, అధ్యాపక బృందంతో కలెక్టర్ సత్యశారద సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సిబ్బంది నియామకం, ఇతర అంశాలపై చర్చించారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని సూచించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో అవసరాలు, వసతులు కల్పించేందుకు కలెక్టర్లు ఇన్‌చార్జీలుగా కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మెడికల్ కళాశాల వైద్యశాల నిర్వహణకు అత్యవసరంగా ఆపరేషన్ థియేటర్స్, కావాలసిన పరికరాలు అందిస్తామని, శస్త్ర చికిత్సలు ప్రారంభించాలని చెప్పారు. ప్రతిపాదనలు పంపిస్తే పరిశీలించి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు, కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌దాస్, సూపరింటెండెంట్ కిషన్, ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపాదనలు సిద్ధం చేయండి
సమీక్షా సమావేశంలో
కలెక్టర్ సత్యశారద సూచన