
కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు ఏడాదైనా నెరవేర్చలేదు. ఉద్యోగాలు కల్పించకపోతే రూ.3,000 నిరుద్యోగ భృతి అంటూ కేవలం ఉత్త ప్రచారానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ యువత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పోలీసులు ఈ ఉద్యమాన్ని అణచివేయాలని తీవ్రంగా ప్రయత్నిచారు. అయినప్పటికీ ఏపీ వ్యాప్తంగా.. వైఎస్సార్సీపీ శ్రేణులు, పెద్ద ఎత్తున తరలివచ్చిన యువత నడుమ సోమవారం(జూన్ 25న) ఈ పోరు సూపర్ సక్సెస్ అయ్యింది.






















