బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్‌గా స్నేహ శబరీష్ శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా బాధ్యతలు స్వీకరించిన స్నేహ శబరీష్‌ను అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్ ఓ వై.వి గణేశ్, డీఆర్డీఏ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ విద్యాలత, అధికారులు పూలమొక్కలు, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని బాధ్యతలు స్వీకరించిన హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం రాత్రి సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ శేషుభారతి, అర్చకులు భద్రకాళి శేషు దేవాలయానికి వచ్చిన కలెక్టర్‌ను ఘనంగా స్వాగతించారు. కలెక్టర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. కలెక్టర్‌తో పాటు ఆమె తల్లిదండ్రులు, కూతురు, కుమారుడు ఉన్నారు. పూజల అనంతరం అర్చకులు మహదాశ్వీచనం అందజేశారు. ఈఓ శేషుభారతి వారికి అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు.
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ స్నేహ శబరీష్


