ముందుగా సాగుచేస్తే అధిక దిగుబడి
ఖిలా వరంగల్: వరి పంటను ముందుగా సాగు చేయడం వల్ల తెగుళ్లు, చీడపీడల ప్రభావం తగ్గి అధిక దిగుబడి వస్తుందని అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యాత్ర సందర్భంగా ఆదివారం నర్సంపేట మండలం ముగ్ధుంపురం గ్రామంలో మామునూ రు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యాత్ర, శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులు అమలు, కేంద్ర ప్రయోజిత పథకాల ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయాన్ని పోత్సహిస్తూ, రసాయన ఎరువులు, పురుగు ముందుల వినియోగాన్ని తగ్గించాలన్నారు. వ్యవసాయంతోపాటు పశుపోషణ, చేపల పెంపకం వంటి అనుబంధ రంగా లపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. అనంతరం మెట్ట పంటల పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. బీడు భూముల్లో సాగు చేయదగిన పంటలు, నీరు తక్కు వ ఉన్న భూముల్లో నీటి కుంటల ప్రాముఖ్యత, డ్రిప్, స్పింక్లర్ సేద్యం ద్వారా నీటి సమర్ధవంతమైన వినియోగం గురించి వివరించారు. అధిక నీటిని వినియోగించే వరి పంటకు బదులుగా ప్రత్యామ్నా య పంటలు ఎంచుకోవాలని సూచించారు. జిల్లా వ్యసాయ అధికారి అనురాధ మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్‌లో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులు, అధిక దిగుబడి రకాల వివరాలతోపాటు, శాశ్వ త సాగు కోసం రైతులు వ్యవస్థాత్మకంగా ప్రణాళిక చేయాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకన్న, డాక్టర్ వీరన్న, ఏడీఏ దామోదర్‌రెడ్డి, వ్యవసాయాధికారి కృష్ణకుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి అశోక్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ సంధ్యారాణి


