
నేటి నుంచి పరిశోధన పద్ధతులపై తరగతులు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ రాజనీ తి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 4 నుంచి 10వ తేదీ వరకు పరిశోధనా పద్ధతులపై అవగాహ న తరగతులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను ఆ విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకట్, బీఓఎస్ డాక్టర్ కిష్టయ్యతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. యూనివర్సిటీకి చెందిన సీనియర్ ఆచార్యులతో అవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 4న ఈతరగతులను కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, సోషల్ సైన్స్ ఆచార్య టి.మనోహర్ ప్రారంభిస్తారని సంకినేని వెంకటయ్య తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ వి.సత్యనారాయణ, డాక్టర్ వి.నాగరాజు పాల్గొన్నారు.