
ప్రజావాణి వినతులను నిర్లక్ష్యం చేయొద్దు
న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన వినతుల ను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణి ఫిర్యాదులు, వినతుల విషయంలో అప్రమత్తంగా ఉంటూ పెండింగ్ లేకుండా పరిష్కరించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించి ప్రజల నుంచి 101 దరఖాస్తులు, వినతులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తుల్లో ఎక్కువగా రెవెన్యూ విభాగానికి సంబంధించి 44 రాగా.. పీడీ హౌసింగ్ 11, మిగితా శాఖలకు సంబంధించినవి 46 వినతులు వచ్చాయని వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్వో విజయలక్ష్మి, వరంగల్ ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, వ్యవసాయశాఖాధికారి అనురాధ, డీసీఓ నీరజ, బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, డీఈఓ జ్ఞానేశ్వర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
నాలా పర్మిషన్ కోసం తిరుగుతున్నా..
నా ఐదు గుంటల భూమికి నాలా పర్మిష న్ ఇవ్వమని అధికా రుల చుట్టూ తిరుతున్నా. వృద్దురాలు అయినప్పటికీ నాపని చేయడంలేదు. ఆఫీసు ల చుట్టూ తిప్పించుకుంటున్నారు. సంవత్సరన్నర నుంచి ఇబ్బందులు పడుతున్నాను.
– ముత్తమ్మ, ధర్మారం, గీసుకొండ
ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలి
అదనపు కలెక్టర్ సంధ్యారాణి
ప్రజలనుంచి 101 దరఖాస్తుల స్వీకరణ

ప్రజావాణి వినతులను నిర్లక్ష్యం చేయొద్దు