
ముగిసిన ‘బార్ అసోసియేషన్’ ఎన్నికలు
వరంగల్ లీగల్: జిల్లా బార్ అసోసియేషన్ 2025–26 నూతన కార్యవర్గం ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగ్గా అనంతరం ఎన్నికల అధికారులు ఫలితాలు వెల్లడించారు. మొత్తం వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్‌లో 566 మంది ఓటర్లు ఉండగా 451 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షుడిగా వి.సుధీర్ (231 ఓట్లు), ప్రధాన కార్యదర్శిగా డి.రమాకాంత్ (172 ఓట్లు) ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు చిదంబర్‌నాఽథ్, శ్రీధర్ వెల్లడించారు. జాయింట్ సెక్రటరీగా ఎం.శ్రీధర్(244 ఓట్లు), మహిళా జూయింట్ సెక్రటరీగా ఆర్.శశిరేఖ (263 ఓట్లు), స్పోర్ట్స్, కల్చరల్ జాయింట్ సెక్రటరీగా ఎన్.శివప్రసాద్(270 ఓట్లు), కోశాధికారిగా ఎస్.అరుణ (242 ఓట్లు), కార్యవర్గ సభ్యులుగా ఎం.రాజు(340 ఓట్లు), జె.రాజు(306 ఓట్లు), ఎం.మేఘనాథ్(295 ఓట్లు), ఎం.మహేందర్(275 ఓట్లు) ఎన్నికై నట్లు వివరించారు.
జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వి.సుధీర్, డి.రమాకాంత్

ముగిసిన ‘బార్ అసోసియేషన్’ ఎన్నికలు