
వరంగల్ (పర్వతగిరి): రైతులు భూసార పరీక్షలు తప్పక చేయించుకోవాలని ఏరువాక వరంగల్ డాట్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దిలీ ప్‌కుమార్, డాక్టర్ వీరన్న సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఫ్యాక్ట్ ఎరువుల కంపెనీ ఆధ్వర్యంలో బుధవారం వ్యవసాయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు అధిక ఎరువుల వాడకాన్ని తగ్గించి భూసారాన్ని పెంచుకోవాలన్నారు. అనంతరం వరి, మొక్కజొన్న పంటలపై అవగాహన కల్పించారు. ఫ్యాక్ట్ ఎరువుల కంపెనీ జోనల్ మేనేజర్ బి.శివేంద్రకుమార్ ఫ్యాక్ట్ కంపెనీ ఎరువులు ఫ్యాక్టంపాస్, అమోనియం సల్ఫేట్, ఫ్యాక్ట్ జిప్సం, ఫ్యాక్ట్ ఆర్గానిక్‌ల గురించి రైతులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలయ్యే పథకాల గురించి మండల వ్యవసాయాధికారి వివరించారు. కార్యక్రమంలో శ్రీవిష్ణువర్ధన్, సేల్స్ ఆఫీసర్ వందన, రైతులు పాల్గొన్నారు.
కంటి వెలుగు శిబిరం తనిఖీ
వర్ధన్నపేట: ఇల్లందలోని కంటి వెలుగు శిబిరాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంటి వెలుగు ప్రారంభం నుంచి నేటి వరకు వైద్య పరీక్షలు ఎన్ని నిర్వహించారు.. ఎంత మందికి కంటి అద్దాలు అందించారు.. ఇంకా ఎంత మందికి అందించాల్సి ఉందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటి పరీక్షలకు వచ్చే వారికి అన్ని సదుపాయాలు అందుతున్నాయా.. అని ప్రశ్నించారు. పరీక్షల్లో మందులు పంపిణీ చేస్తున్నారా.. అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్లను పరిశీలించారు. కార్యక్రమంలో శిబిరం డాక్టర్ అన్వేష్, డీఈఓ శ్రీనివాస్, ఏఎన్‌ఎం సరోజన, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ముగిసిన ఇంటర్
‘ద్వితీయ’ పరీక్షలు
కాళోజీ సెంటర్: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీ య సంవత్సరం పరీక్షలు బుధవారం ముగిశా యి. 27 కేంద్రాల్లో 6,522 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా.. 6,225 మంది రాశారని, 297 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ కాక మాధవరావు తెలిపారు. జనరల్ కోర్సులో 256, ఒకేషనల్‌లో 41 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
చిరుధాన్యాల్లో
పోషక విలువలు
రాయపర్తి: చిరుధాన్యాలతో కూడిన పౌష్టికాహా రంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయ ని, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అందించే పౌష్టికాహారాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి శారద, సీడీపీఓ శ్రీదేవి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలతోపాటు కాట్రపల్లిలో చిరుధాన్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశుభ్రతతోపాటు ఆకుకూరలతో కూడిన పౌష్టికాహారాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమాల్లో ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్, సూపర్‌వైజర్ స త్యవతి,విజయలక్ష్మి,హెచ్‌వీ మాధవీలత, ఏ ఎన్‌ఎం వనిత, కవిత, సరోజ, కార్తీక్, ఆశ వర్క ర్ రాజేశ్వరి పాల్గొన్నారు. కాట్రపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ బోనగిరి ఎల్ల య్య, ఉపసర్పంచ్ రేణుక, సూపర్‌వైజర్ మాధవీలత, వీఓ అధ్యక్షురాలు యాకాంత, రేణుక, రవళి,శోభ,అంగన్‌వాడీ టీచర్ ఎండి.యాకూ బీ, రమ, కనకతార, భాగ్యమ్మ పాల్గొన్నారు.

