గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి

May 1 2026 8:26 AM | Updated on May 1 2026 8:26 AM

గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి

ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. శరీరం నిర్జలీకరణం కాకుండా ఎప్పటికప్పుడు ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. తాగునీటిలో ఉప్పు లేదా చక్కెర వేసుకొని తాగాలి. ఎండల తీవ్రతకు గర్భస్రావమయ్యే అవకాశాలు, తొమ్మిది నెలలు నిండిన వారికి కడుపులో బిడ్డ చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎండల కారణంగా ఐదో నెల నుంచి గర్భంలో బిడ్డ కదలికలు తగ్గుతాయి. వేసవిలో గర్భిణులు బయటకు వెళ్లకపోవడం మంచిది. మాంసాహారం, మసాలా దినుసులు, నూనె పదార్థాలు అధికంగా వాడరాదు. బాలింతలు గదిలో ఫ్యాన్‌ను తక్కువ వేగంతో పెట్టుకోవాలి. కీరదోస, పుచ్చకాయ లాంటి తాజా పండ్లు తీసుకోవడం ఉత్తమం. – డాక్టర్‌ ప్రతిభ,

సీ్త్ర వైద్య నిపుణులు, మహబూబ్‌నగర్‌

Advertisement
 
Advertisement
Advertisement