లక్ష్యం చేరలే..! | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం చేరలే..!

Apr 8 2026 7:50 AM | Updated on Apr 8 2026 7:50 AM

జిల్లాలోని పురపాలికల్లో 42.59 శాతమే పన్ను వసూలు

లక్ష్యం రూ.19.20 కోట్లు.. వసూలు చేసింది రూ.9.47 కోట్లు

బకాయిలు రూ.10.47 కోట్లు

అమరచింత: జిల్లాలోని ఐదు పురపాలికల్లో 2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆస్తి పన్ను వసూళ్లు మందకొడిగా సాగాయి. మార్చిలో ఇంటి, కొళాయి పన్ను వసూళ్లలో అధికారులు వేగం పెంచినా.. లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. రూ.19.20 కోట్ల పన్ను వసూలు చేయాల్సి ఉండగా.. మార్చి 31వ తేదీ నాటికి రూ.9.47 కోట్లు (42.59 శాతం) మాత్రమే వసూలు చేయగలిగారు. బకాయిలతో పాటు కొత్త ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని పూర్తిచేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతామని ఆయా పుర కమిషనర్లు చెప్పడం గమనార్హం.

అమరచింత పుర కార్యాలయం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement