 
															రైతన్నకు కన్నీరే దిక్కు..!
ఉమ్మడి పాలమూరులోని నాగర్‌కర్నూల్ జిల్లాలో తుపాను ప్రభావం అధికంగా ఉన్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఈ జిల్లాలో మొత్తంగా 14,388 మంది రైతులకు సంబంధించి 33,559 ఎకరాల్లో వరి, పత్తి, మొక్క జొన్న, మినుము, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత వనపర్తి జిల్లాలో 1,336 మంది రైతులకు చెందిన 2,270 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 1,013 మంది రైతులకు సంబంధించి మొత్తం 1,141 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యసాయ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ఉమ్మడి జిల్లాలో 36,970 ఎకరాల్లో పంట నష్టం
కోత దశలో వరద నీటిలో
నేలకొరిగిన వరి
ఏరే దశలో చేలల్లోనే
తడిసి ముద్దయిన పత్తి
నాగర్‌కర్నూల్ జిల్లాలో అధిక ప్రభావం
ఆ తర్వాత వనపర్తి, మహబూబ్‌నగర్
జిల్లాలో..
నష్ట పరిహారం ఇవ్వాలని
అన్నదాతల వేడుకోలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
