‘ప్రజాబాట’తో విద్యుత్‌ సమస్యలుపరిష్కారం | - | Sakshi
Sakshi News home page

‘ప్రజాబాట’తో విద్యుత్‌ సమస్యలుపరిష్కారం

Oct 31 2025 8:31 AM | Updated on Oct 31 2025 8:31 AM

‘ప్రజ

‘ప్రజాబాట’తో విద్యుత్‌ సమస్యలుపరిష్కారం

ఖిల్లాఘనపురం: గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని విద్యుత్‌ సమస్యలను ప్రజాబాట కార్యక్రమంలో పరిష్కరిస్తామని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ రాజశేఖరం, డీఈ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని సోళీపురం, ఉప్పరిపల్లిలో గురువారం వారు పర్యటించి సబ్‌స్టేషన్లను పరిశీలించి ఆయా గ్రామాల్లో విద్యుత్‌ వినియోగదారులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. సోళీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన రెండు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల దిమ్మెల ఎత్తు తక్కువగా ఉండటంతో వారాంతపు సంత రోజు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని, వెంటనే ఎత్తు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉప్పరిపల్లిలోని ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద వర్షం, సాగునీరు నిల్వడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. సమస్య పరిష్కారాన్ని త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వేసవిలో లోఓల్టేజీ సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున మరో 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయా గ్రామాల్లో వ్యవసాయానికి అందించే విద్యుత్‌ సరఫరాకు ఏబీ స్విచ్ఛులు ఏర్పాటు చేస్తామన్నారు. వారి వెంట ఏడీఈ రాజయ్యగౌడ్‌, ఏఈ సుధాకర్‌, పలువురు విద్యుత్‌ సిబ్బంది ఉన్నారు.

మానవత్వం చాటిన

అటవీ సిబ్బంది

మన్ననూర్‌: పురిటి నొప్పులతో బాధపడుతున్న చెంచు మహిళను అటవీ శాఖ సిబ్బంది ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. లింగాల మండలం లోతట్టు అటవీ ప్రాంతంలోని అప్పాపూర్‌ గ్రామంలో గర్భిణి తోకల జగదీశ్వరి రెండు రోజులుగా పురిటి నొప్పులతో బాధపడుతుంది. ఈ క్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డికి అటవీ శాఖ సిబ్బంది ద్వారా సమాచారం అందింది. దీంతో పీఓ, ఎఫ్‌ఆర్‌ఓ వీరేష్‌ తక్షణమే స్పందించి ఫరహాబాద్‌ వద్ద ఉన్న సఫారీ వాహనంతోపాటు అటవీ శాఖకు చెందిన ఎఫ్‌బీఓ శిల్ప, మరి కొంత మంది సిబ్బందిని అప్పాపూర్‌కు పంపించారు. గర్భిణికి తోడుగా ఉండే మహిళలను సఫారీ వాహనం ద్వారా మన్ననూర్‌ గ్రామం వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో అచ్చంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చారు.

‘ప్రజాబాట’తో విద్యుత్‌  సమస్యలుపరిష్కారం 1
1/1

‘ప్రజాబాట’తో విద్యుత్‌ సమస్యలుపరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement