 
															చెరుకుకు రూ.6 వేల మద్దతు ధర చెల్లించాలి
అమరచింత: కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాకు రూ.7 వేల మద్దతు ధర చెల్లిస్తోందని.. అదే మాదిరిగా టన్ను చెరుకుకు రూ.6 వేలు ఇవ్వాలని, కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఇస్తున్న రాయితీలు వచ్చే ఏడాది కూడా కొనసాగించాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు. గురువారం సంఘం ఆధ్వర్యంలో చెరుకు రైతులు ఫ్యాక్టరీ ఈడీ రవికుమార్, డీజీఎం నాగార్జునరావు, కేన్ అడ్వయిజర్ రామ్మోహన్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరిగిన ధరల ప్రకారం కంపెనీ ఇస్తున్న బోనస్‌తో కలిపి టన్ను చెరుకుకు రూ.ఆరు వేలు చెల్లించాలని కోరారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా సకాలంలో పంట కోతలు పూర్తిచేసి డబ్బులు త్వరగా చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తామని.. రాయితీలు వచ్చే ఏడాది కూడా కొనసాగిస్తామని ఫ్యాక్టరీ ఈడీ హామీ ఇవ్వడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు వాసారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, నారాయణ, రాజశేఖర్, చంద్రసేనారెడ్డి, రంగారెడ్డి, శాలిమియా, మహేంద్రాచారి, వీరన్న, రవి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘ఈత చెట్లు తొలగించిన వారిని శిక్షించాలి’
కొత్తకోట: జిల్లాలోని కల్వరాల గ్రామ శివారు సర్వేనంబర్లు 398, 399, 407, 394, 395, 396, 407లో 200కు పైగా ఉన్న ఈత చెట్లను అదే గ్రామానికి చెందిన ఉమేష్‌రెడ్డి, వెంకట్రామారెడ్డి, అనిల్‌రెడ్డి, రంగారెడ్డి పొక్లెయిన్‌తో తొలగించారని.. వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గౌడజన గీతకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి రామన్‌గౌడ్ కోరారు. గురువారం పట్టణంలోని ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయంలో కార్యాలయ అధికారి కరుణకు ఫిర్యాదు అందజేసి మాట్లాడారు. రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహించే కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇలాంటి దారుణం జరగడం హేయమైన చర్య అన్నారు. జిల్లాలో చాలాచోట్ల ఈతవనాలు తొలగించడం నిత్యకృత్యంగా మారిందని చెప్పారు. ఎకై ్సజ్ చట్టం ప్రకారం రైతు తన సొంత పొలంలో ఈత, తాటి చెట్లను ధ్వంసం చేయడం చట్టరీత్యా నేరమన్నారు.
శంకరసముద్రానికి స్వల్పంగా వరద
కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి శివారులో ఉన్న శంకరసముద్రానికి గురువారం స్వల్పంగా వరద చేరినట్లు ఏఈ మనోజ్‌కుమార్ తెలిపారు. ఎగువ నుంచి 1,300 క్యూసెక్కుల వరద రాగా.. జలాశయం 4 గేట్లను రెండు ఫీట్ల మేర పైకెత్తి 2,200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు వివరించారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ముందస్తు జాగ్రత్తగా గేట్లను ఎత్తినట్టు పేర్కొన్నారు.
రంగసముద్రం జలాశయం వద్ద..
వనపర్తి రూరల్: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగసముద్రం రిజర్వాయర్‌లో గురువారం నీటిమట్టం పెరగడంతో ఒక షట్టర్ తెరిచి 280 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ఏఈ వినయ్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
							చెరుకుకు రూ.6 వేల మద్దతు ధర చెల్లించాలి
 
							చెరుకుకు రూ.6 వేల మద్దతు ధర చెల్లించాలి
 
							చెరుకుకు రూ.6 వేల మద్దతు ధర చెల్లించాలి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
