కిక్కు తగ్గింది..!
● ముగిసిన మద్యం దుకాణాల టెండర్ల స్వీకరణ
● ఈ నెల 27న కలెక్టరేట్లలో లక్కీడిప్
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఈసారి జరిగిన మద్యం టెండర్ల ప్రక్రియలో జోష్ తగ్గింది. వ్యాపారులు దుకాణాల కోసం తీవ్రంగా పోటీ పడిన పరిస్థితి కనిపించలేదు. రెండుసార్లు గడువు పెంచినా కూడా వ్యాపారుల నుంచి ఊహించిన స్థాయిలో స్పందన రాలేదు. గత రెండేళ్ల కిందట జరిగిన దరఖాస్తుల స్వీకరణతో పోల్చితే ఈసారి చాలా వరకు తగ్గాయి. ఉమ్మడి జిల్లాలోని 227 మద్యం దుకాణాలకు మొత్తం 5,536 టెండర్లు రావడం జరిగింది. చివరి రోజు గురువారం మొత్తం 251 దరఖాస్తులు రాగా ఇందులో మహబూబ్‌నగర్‌లో 69, వనపర్తిలో 75, నారాయణపేటలో 43, నాగర్‌కర్నూల్‌లో 81, గద్వాలలో 46 దరఖాస్తులు ఉన్నాయి. ఇక ఉమ్మడి జిల్లా నుంచి టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.166.08 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా.. ఈ నెల 27న ఆయా జిల్లాల కలెక్టరేట్లలో లక్కీడిప్ ద్వారా దుకాణాలు కేటాయించనున్నారు. 2023తో పోలిస్తే ఈ సారి 3,038 టెండర్లు తక్కువగా వచ్చాయి.
జిల్లాల వారీగా ఇలా..
జిల్లా చివరిరోజు మొత్తం సమకూరిన
వచ్చిన టెండర్లు ఆదాయం
టెండర్లు (రూ.కోట్లలో..)
మహబూబ్‌నగర్ 69 1,634 49.02
నాగర్‌కర్నూల్ 81 1,518 45.54
నారాయణపేట 43 853 25.59
జోగుళాంబ గద్వాల 46 774 23.22
వనపర్తి 75 757 22.71
దాఖలైన
టెండర్లు 5,536


