
వంతెన పనులకు నిధులు మంజూరు
మదనాపురం: మండల పరిధిలోని ఊకచెట్టువాగుపై అసంపూర్తిగా ఉన్న వంతెన పనులు త్వరలోనే పునః ప్రారంభం కానున్నాయని.. అప్రోచ్ వర్కులు, మిగతా పనులకుగాను ప్రభుత్వం రూ.6 కోట్లు మంజూరు చేసిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన జీఓ కాపీని హైదరాబాద్‌లో ఆర్‌అండ్‌బీ చీఫ్ సెక్రెటరీ వికాస్‌రాజ్ అందజేసినట్లు వివరించారు. ప్రయాణికులు, వాహనాదారుల సౌకర్యార్థం పనులు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించామని.. సోమవారం నుంచే పునః ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వంతెన నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు తీసుకొచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.