
మా పిల్లల చదువు సంగతేంటి
● డీఈఓతో బెస్ట్ అవైలబుల్ విద్యార్థుల
తల్లిదండ్రుల వాదన
వనపర్తిటౌన్: ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో తమ పిల్లలను యాజమాన్యం రానివ్వడం లేదని బెస్ట్ అవైలబుల్ పాఠశాలకు ఎంపికై న విద్యార్థుల తల్లిదండ్రులు డీఈఓ అబ్ధుల్ ఘనీతో మొరపెట్టుకున్నారు. శుక్రవారం డీఈఓ కార్యాలయంలో జిల్లా విద్యాధికారి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి మల్లికార్జున్‌తో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జిల్లాలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 120 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో దసరా సెలవులు ముగిసిన తర్వాత యాజమాన్యం పిల్లలను పాఠశాలకు రానివ్వడం లేదని.. చొరవ చూపకుంటే వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన అధికారులు వెంటనే పట్టణంలోని రేడియంట్ పాఠశాల యాజమాన్య సభ్యుడు భాస్కర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. నిధులు విడుదల కాకుండా విద్యార్థులను బలవంతంగా పాఠశాలకు పంపితే తాము ఆత్మహత్య చేసుకోకతప్పదని హెచ్చరించారు. ఇదే దశలో తల్లిదండ్రులు కలగజేసుకొని సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని అధికారులతో చెప్పడంతో కాసేపు గందరగోళం నెలకొంది. పాఠశాల యాజమాన్యం 5 రోజులు గడువు కోరిందని.. ఆలోగా స్పందించకుంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు బెస్ట్ అవైలబుల్ స్కూల్ గుర్తింపు ఉన్న పాఠశాలకు నోటీసులు జారీచేసి చర్యలు తీసుకుంటామని సూచించారు.