
రుణం అధికంగా పొందే అవకాశం..
లోక కల్యాణ మేళాలో కొత్తగా వీధి విక్రయదారులను గుర్తించి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిస్తాం. దీంతోపాటు వీధి విక్రయదారుల సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలు తెరిపించడంతో అధికంగా రుణం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న రుణాల మాదిరిగా భవిష్యత్‌లో వీరి పొదుపును దృష్టిలో ఉంచుకొని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంది. సంఘాల ఏర్పాటుపై వీధి విక్రయదారులకు అవగాహన కల్పిస్తున్నాం. – బాలరాజు, జిల్లా కో–ఆర్డినేటర్, మెప్మా
●