
చిరు వ్యాపారులకు చేయూత
‘లోక కల్యాణ మేళా’తో రుణాలు
సంఘాల ఏర్పాటుపై దృష్టి..
ప్రతి సంఘంలో 5 నుంచి 10 మంది వీధి విక్రయదారులు ఉండేందుకు అవకాశం కల్పించడంతో మున్సిపాలిటీలో వీధి విక్రయదారుల పొదుపు సంఘాల ఆవిర్భావానికి అంకురార్పణ జరిగినట్లయింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 150కి పైగా సంఘాలు ఏర్పాటైనట్లు మెప్మా అధికారులు తెలిపారు. జిల్లాలోని ఐదు పురపాలికల్లో 6,463 మంది వీధి విక్రయదారులు బ్యాంకుల్లో రుణాలు పొంది క్రమం తప్పకుండా నెలవారీగా కిస్తులు చెల్లిస్తూ తిరిగి రుణాలు పొందుతున్నారని వివరించారు. గ్రూప్‌లో ఉన్న ప్రతి సభ్యుడు ప్రతి నెల బ్యాంకులో రూ.100 నుంచి రూ.200 వరకు పొదుపు జమ చేయాల్సి ఉంటుంది.
గ్రూప్ రుణాలు..
ఇప్పటి వరకు వీధి విక్రయదారులకు వ్యక్తిగతంగా బ్యాంకు రుణాలిచ్చిన అధికారులు ప్రస్తుతం మహిళా సంఘాల మాదిరిగా వీధి విక్రయదారుల సంఘాలకు బ్యాంకుల నుంచి రుణాలిప్పించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గతంలో వ్యక్తిగతంగా రూ.10 వేల నుంచి మొదలు రూ.20 వేలు వరకు తిరిగి చెల్లించిన వారికి రూ.50 వేల వరకు రుణం ఇచ్చారు. ఇలా వ్యక్తిగతంగా కాకుండా ఒకేసారి గ్రూప్‌నకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం మంజూరు చేసే వీలుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇందుకోసం మెప్మా ఆర్పీలు తమ క్లస్టర్ పరిధిలో రుణం పొంది సకాలంలో తిరిగి చెల్లిస్తున్న వారి జాబితాను సిద్ధం చేసి పాత, కొత్త వారిని కలిపి సంఘాల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు.
అమరచింత: కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి ద్వారా వీధి విక్రయదారులకు బ్యాంకు రుణాలు అందించి వ్యాపార అభివృద్ధికి తోడ్పాటునందిస్తోంది. ప్రస్తుతం ‘లోక కల్యాణ మేళా’లో భాగంగా ఇప్పటి వరకు రుణం పొందని వీధి విక్రయదారులను గుర్తించి వారికి కూడా బ్యాంకుల ద్వారా రుణాలిప్పించేందుకు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేళా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కొనసాగాల్సి ఉండగా.. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ నెల 17 వరకు పొడిగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెప్మా కో–ఆర్డినేటర్లు పురపాలికల్లో బ్యాంకు రుణాలు పొందని వీధి విక్రయదారులను గుర్తించే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. కరోనా సమయంలో చిరు వ్యాపారులకు చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ పథకంలో భాగంగా బ్యాంకుల్లో రుణాలిప్పించి ఆదుకుంది. రూ.పది వేల నుండి ప్రారంభించి ప్రస్తుతం వ్యక్తిగతంగా రూ.20 వేలు, రూ.50 వేల వరకు రుణం తీసుకొని తమ వ్యాపారాలను లభివృద్ధి చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే అవకాశం కల్పించింది.
మొదటి విడతగా రూ.15 వేలు
సంఘాల ఏర్పాటుకూ కసరత్తు
జిల్లాలోని పురపాలికల్లో 6,463 మంది వీధి విక్రయదారులు
ఈ నెల 17 వరకు అవగాహన సదస్సులు

చిరు వ్యాపారులకు చేయూత