
నామినేషన్ల ప్రక్రియకు సర్వం సిద్ధం
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన జారీచేసి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్, ఎస్పీ రావుల గిరిధర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.జెడ్పీటీసీల నామినేషన్ల స్వీకరణకు 8 ఆర్‌ఓ కేంద్రాలు ఎంపీడీఓ కార్యాలయాల్లో, ఎంపీటీసీల నామినేషన్ల స్వీకరణకు 21 కేంద్రాలు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఎఫ్‌ఎస్‌టీ, సర్వైలియన్ స్టాటిస్టిక్ బృందాలు పని చేస్తున్నాయన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీఆర్డీఓ ఉమాదేవి, డీపీఓ రఘునాథ్‌రెడ్డి, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి